25.2 C
Hyderabad
May 8, 2024 08: 43 AM
Slider నల్గొండ

వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి

#drinkingwater

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ఎంపిపి గూడెపు శ్రీనివాస్ అధ్యక్షతన తాగునీటి ఎద్దడి పరిష్కారం కొరకు మండల స్థాయి సమావేశం జరిగినది.

ఈ సమావేశంలో 2022 – 23 సంవత్సరానికి సంబంధించి ఎండా కాలంలో గ్రామ పంచాయతీల వారీగా సమస్యల గురించి చర్చించారు.మిషన్ భగీరథ నీరు గ్రామ పంచాయతీలైన లింగగిరి,సీతారాంపురం కు ఈ వేసవిలో త్రాగునీరు,వేసవి కాలంలో తీసుకోవాల్సిన చర్యలు వేగవంతం చేయవలసినదిగా కోరారు.

ఈ సమావేశంలో డిప్యూటీ ఈ.ఈ. ఎం.వెంకట్ రెడ్డి, గ్రిడ్ ఏ.ఈ.ఈ.లు జయచంద్ర,సిద్ధార్థ్,శ్యామల, ఎంపిడిఓ శాంతకుమారి,ఎంపిటిసి లు, సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయం పర్యవేక్షకుడు నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

స్నోతుఫాన్ :బెలూచిస్తాన్ లోమంచువర్షం 31మంది మృతి

Satyam NEWS

వైఎస్సార్సీపీ మంత్రులు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు

Bhavani

బొక్కబోర్లా పడ్డా బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు: రేవంత్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment