37.2 C
Hyderabad
May 6, 2024 12: 48 PM
Slider ముఖ్యంశాలు

అక్రమ దందాలో బి.ఆర్.యస్. నాయకులు

#revanthreddy

ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలం అయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా ఆ జిల్లాకు చేసిందేమి లేదన్నారు. హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి సమక్షంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా కేసీఆర్ చేతిలో మోసపోయిందన్నారు. ల్యాండ్, సాండ్, మైన్, వైన్ ఏ దందాలో చూసినా బీఆర్ఎస్ నేతలే ఉన్నారని ఆరోపించారు.

జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని.. ఆయన చివరకు వక్ఫ్ భూములను సైతం వదలడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల అరాచకాలను ఎదిరించేందుకు ఇవాళ నేతలు కాంగ్రెస్‌లో చేరడం అభినందనీయం అన్నారు. పార్టీలో చేరిన వారికి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14కు 14 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో పాలనలో అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి శూన్యం అని.. ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లు అమ్మి జిల్లాను అభివృద్ధి చేస్తానని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీఎం అయినా జిల్లాను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

అధికారంలోకి రాగానే కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్, కేటీఆర్‌కు వంద ఎకరాల ఫామ్ హౌస్‌లు వచ్చాయని.. వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, టీవీలు, పేపర్లు వచ్చాయన్నారు. పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించొద్దన్నారు. అక్రమ కేసులు పెడితే మిత్తితో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుందామని, ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అన్నారు.

Related posts

ప్రజలే ప్రభువులుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాల‌న

Satyam NEWS

ప్రమాదానికి గురైన లాంచికి అనుమతి లేదు

Satyam NEWS

ప్రజా సమస్యలు పరిష్కారం కోసం 30 న చలో తహిశీల్దార్ ఆఫీస్

Satyam NEWS

Leave a Comment