23.2 C
Hyderabad
May 8, 2024 00: 07 AM
Slider విజయనగరం

ప్రజా సమస్యలు పరిష్కారం కోసం 30 న చలో తహిశీల్దార్ ఆఫీస్

#cpmvijayanagaram

జనం కోసం సీపీఎం కార్యక్రమం లో బాగంగా వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కారం కోసం  30 న విజయనగరం చలో తహశీల్దార్ అఫీస్ కార్యక్రమం చేపడుతున్నామని  సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు పిలుపునిచ్చారు.

ఈ రోజు ఎల్ బీ.జీ భవన్ లో జరిగిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ టిడ్ కో  ఇల్లు నగరంలో సారిపల్లివద్ధ 2526.. సోనియా నగర్ లో 1126 ఇల్లు గత ప్రభుత్వం చేపడితే పూర్తి అయిన 2526 ఇల్లు కూడా అప్ప జెప్పా కుండా కేవలం 800 ఇల్లు పట్టాలు ఇచ్చి సంబరాలు చేసుకోమని ఎం ఎస్ మంత్రి  చెప్పడం హస్యా స్పదంగా ఉన్నదని ఆయన అన్నారు..

అలాగే సీపీఎం బృందాలు ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకుంటే మా దృష్టి కి ప్రజలు అనేక సమస్యలు తీసుకొచ్చారు. ప్రధానంగా ఇల్లు పట్టాలు.. మంచినీ రు . మరుగు దొడ్లు.. డ్రైనేజీ.. అధిక దరలు.. జగనన్న కాలని సమస్యలు చెత్త పన్ను.. రోడ్లు…లాంటి సమస్యలు మాధృష్టి కి వచ్చాయని అన్నారు. గంజిపెట దళితులు నివాసముంటున్న కాలనీలో మంచినీరు.. ఇంటిప న్నులు.. ఇంటి పట్టాలు లేవు అని వాటికోసం ఇప్పటికే పలు మార్లు పోరాడామని తెలిపారు.

పై సమస్యలు పై సీపీఎం పోరాడుతుందని.. ప్రజలకు న్యాయం జరిగేవరకు మీకు అండగానిలిచేందుకు సీపీఎం నాయకత్వం ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు.. అలాగే జి. వో no 225  ప్ర కారం ప్రభుత్వ స్థలంలో 75 గజాలు ఉచితంగా రెగ్యులర్ చేయాలి.

ఆరకంగా నగరంలో పూరిల్లలో నివాసముంటున్న వారందరినీ రెగ్యుల రైజ్ చేయాలి.. కానీ అపని ప్రభుత్వం ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. పై సమస్యలు పరిష్కారం చేయక పోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చి రించారు . సచివాలయం..పరంగా ఎదరవుతున్న ప్రజాసమస్యలపై ఈ నెల 30 న జరిగే చలో తహశీల్దారు ఆఫీస్ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని రెడ్డి శంకరరావు పిలుపు నిచ్చారు…పార్టీ నగర కార్యవర్గ సభ్యులు జగన్ మోహన్.. సురేష్ లు పాల్గొన్నారు.

Related posts

పందెం కోళ్లను అరెస్టు చేసిన పాల్వంచ పోలీసులు

Satyam NEWS

ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా టీకా ఉచితం

Satyam NEWS

కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

Leave a Comment