29.7 C
Hyderabad
April 29, 2024 09: 14 AM
Slider ఆదిలాబాద్

ప్రజలే ప్రభువులుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాల‌న

#chatrapati

ప్రజలే ప్రభువులుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాల‌న సాగిందని కొమరం భీం జిల్లా బిజెపి అధ్యక్షులు డా కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు చేడ్వాయి గ్రామం లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం డా కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి భారతీయుడి హృదయంలో ఇప్పటికీ శివాజీ మహారాజ్ శౌర్యప్రతాపం మిళితమై ఉందని అన్నారు.

ఆయన కథలు పిల్లలకు సాహసం, వక్తృత్వానికి ప్రభావితం చేస్తూనే ఉన్నాయని అన్నారు. ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ యుద్ధ నైపుణ్యం, ప‌రిపాల‌న, అదర్శనీయమని అని తెలిపారు. స్థానిక అరే సంగం నాయకులతో క‌లిసి ముందుగా జెండా ఆవిష్కరణ చేసి అనంతరం చేడ్వాయి  జంక్ష‌న్‌లో శివాజీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. చేడ్వాయి జంక్ష‌న్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమ‌న్నారు.

పరిపాలన, యుద్ద నైపుణ్యంలో అన్నింటా శివాజీ ఆదర్శమ‌ని కొనియాడారు. మత సామర్యాన్ని ఆయన చాటారు. ప్రజలే ప్రభువులుగా ఆయ‌న పాల‌న సాగింద‌న్నారు. శివాజీ ఎన్నో యుద్దాలు చేసినా హింసను ప్రోత్సహించలేదు.. పవిత్ర స్థలాలు ధ్వంసం చేయలేదని ఆయన గుర్తు చేశారు.

యువత వారు నిర్ణయించుకున్న గమ్యం సాధించడంలో శివాజీని స్ఫూర్తిగా తీసుకోవలన్నారు. శివాజీ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో అరే సంగం జిల్లా, మండల, స్థానిక నాయకులు ఇతర ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

Related posts

పురుగుల మందు డబ్బాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

బాంబు దాడిలో  15మంది పిల్లలు మృతి

Murali Krishna

సాదు కుంటారో.. సంపుకుంటారో మీ చేతుల్లోనే ఉంది

Bhavani

Leave a Comment