37.7 C
Hyderabad
May 4, 2024 11: 49 AM
Slider రంగారెడ్డి

హఠ మరియు ఆపూర్వ యోగ మీద శిక్షణ కార్యక్రమం

#cbit

సి బి ఐ టి – యెన్ ఎస్ ఎస్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సంయుక్తం గా నిన్న మరియు ఈ రోజు హఠ మరియు ఆపూర్వ యోగ మీద ప్రత్యేక  శిక్షణ కార్యక్రమం నిర్వహించింది.  నిన్న జరిగిన కార్యక్రమానికి  ముఖ్య అతిధి గా  ప్రఖ్యాత అంతర్జాతీయ యోగా మరియు వెల్‌నెస్ కోచ్ నీకీ సింగ్‌ పాల్గున్న విద్యార్థులకు మరియు అధ్యాపకులకు    హఠ యోగ  యొక్క ఆసనాలు చేసి చూపించారు.   మరియు మాట్లాడుతూ  హఠ యోగంలో వాడే ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు మరియు ధ్యానాలు ఉంటాయి. ఈ రకమైన యోగ లో ఎంతో  శ్రమ, నిష్ఠా మరియు అభ్యాసం అవసరం. ఈ యోగాన్ని అభ్యాసించేవారు స్వంత ఆత్మసంయమను, స్థైర్యం, శక్తి, మన శాంతి మరియు శారీరక ఆరోగ్యం పొందగలరు అని తెలిపారు.  

ఈ రోజు జరిగిన   ఆపూర్వ యోగ మీద శిక్షణ కార్యక్రమం లో కెఎమ్ఆర్ఆర్  డైరెక్టర్ సి.వి.రావు ముఖ్య అతిది పాల్గొని ఆపూర్వ యోగ గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెస్ర్ పి రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ ఎమ్ గణేశా రావు, అసిస్టెంట్ ఫిసికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్వరి ,  యెన్ఎస్ఎస్ విద్యార్థి విభాగ ప్రెసిడెంట్ ఎ నిఖిల్,  చంద్ర వికాస్ పాల్గొన్నారు.

Related posts

ఏడేళ్ల హరితహారానికి రూ.10వేల కోట్లు ఖర్చు

Bhavani

భక్తి ముసుగులో పిల్లల అపహరణ..పోలీసుల అదుపులో దొంగ స్వామీజీ…!

Satyam NEWS

ఘనంగా ప్రారంభం అయిన రెడ్డీస్ మ‌ల్టీప్లెక్స్‌

Sub Editor

Leave a Comment