28.7 C
Hyderabad
April 28, 2024 08: 17 AM
Slider క్రీడలు

ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలకు కార్యాచరణ ప్రణాళిక

#Dr. KS Jawahar Reddy

అక్టోబరు 2వ తేదీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నాడు ప్రారంభించ ప్రతిపాదించిన ”ఆడుదాం ఆంధ్ర” పేరిట నిర్వహించనున్న క్రీడా సంబరాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు,2023-2028 క్రీడా పాలసీపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్ర క్రీడల శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

గ్రామ,వార్డు సచివాలయాల స్థాయి నుండి మండల,అసెంబ్లీ నియోజకవర్గ,జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఇందుకు గాను గ్రామ,మండల స్థాయిల్లో అనువైన క్రీడా ప్రాంగణాలు,మైదానాలను గుర్తించి వాటిని వివిధ క్రీడల నిర్వహణకు వీలుగా అన్ని విధాలా తీర్చిదిద్దాలని ఆదేశించారు.అంతే గాక ఈక్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు వీలుగా గ్రామ స్థాయి నుండి ప్రజలు ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యే విధంగా ప్రోత్సాహించాలని సూచించారు.

ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా క్రికెట్,బాడ్మింటన్, వాలీబాల్,కోకో,కబడ్డి వంటి క్రీడలతో పాటు ఇతర సాంప్రదాయ క్రీడలను కూడా నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

అదే విధంగా 2023-2028 రాష్ట్ర క్రీడా విధానం గురించి కూడా సిఎస్ అధికారులతో సమీక్షించారు. వివిధ క్రీడా కారులను ప్రోత్సహించేందుకు అదే విధంగా స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వివిధ క్రీడా పరమైన మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేగాక గ్రామ స్థాయి నుండి యువత పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా మరీ ముఖ్యంగా ప్రతిభ గల క్రీడా కారులను ప్రోత్సాహించే విధంగా నూతన క్రీడా పాలసీ ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడలు,యువజన సర్వీసులు శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్,రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్,సియం కార్యదర్శి ఆర్.ముత్యాల రాజు,రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విసి అండ్ ఎండి కె.హర్షవర్థన్ తదితరులు పాల్గొనగా, వీడియో లింక్ ద్వారా ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు,కెఎస్.భరత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వస్తు రవాణ వాహనాలకు జిల్లా పోలీసు అనుమతి పొందాలి

Satyam NEWS

టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో మంత్రి పార్థ అవుట్

Satyam NEWS

తక్షణమే ముఖ్యమంత్రి పదవిని వికేంద్రీకరించాలి

Satyam NEWS

Leave a Comment