27.7 C
Hyderabad
May 4, 2024 08: 54 AM
Slider ప్రత్యేకం

పైడిత‌ల్లి పండుగ: సిరిమాను తిరిగే ప్రాంతాల్లో సీసీ కెమారాలు ఏర్పాటు…!

#sirimanu

విజ‌య‌న‌గ‌రం ఇల‌వేల్పు…పూస‌పాటివంశీయుల ఆడ‌ప‌డుచు శ్రీశ్రీశ్రీపైడిత‌ల్లి అమ్మ‌వారి జాత‌ర నేప‌ధ్యంలో  కేవ‌లం రెండు అంటే రెండు రోజులే…అంటే ఈ నెల 18,19 తేదీల‌లో తొలేళ్ల  ఉత్స‌వం…సిరిమానుజాత‌ర నిర్వ‌హించేందుకు పైడిత‌ల్లి అమ్మ‌వారి దేవ‌స్థానం స‌న్న‌ద్దమ‌వుతోంది.

ఈ నేప‌ధ్యంలో బందోబ‌స్తు ఎలా నిర్వ‌హించాలి…ఎంత మంది అవ‌స‌రం…ఏయే ప్రాంతాల‌నుంచీ  సిబ్బంది అవ‌స‌రం అన్న దానిపై  జిల్లాఎస్పీ దీపికా…శాఖా సిబ్బందితో డీపీఓలో ఈ సాయంత్రం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌ధానంగా సిరిమాను తిరిగే హుకుంపేట‌,ఉల్లి వీధి,క‌న్య‌క ప‌ర‌మేశ్వ‌రి టెంపుల్, గంటస్థంభం, మూడులాంత‌ర్లు.. .ప్రాంతాల‌లో..స‌మీప బిల్డింగ్ ల‌లో గ‌ట్టి బందోబ‌స్తు నిర్వ‌హించాల‌ని అలాగే ఆయా ర‌హ‌దారుల్లో సీసీకెమారాలు ఏర్పాటు చేయాల‌ని…అలాగే క‌రోనా ఉన్న‌దృష్ట్యాసిబ్బంది కచ్చితంగా డ‌బుల్ మాస్క్ లు  ధ‌రించాల‌ని ఎస్పీ దీపికా..శాఖా సిబ్బందికి సూచ‌న‌లు జారీ చేసారు.

అలాగే అంజ‌లిర‌థం, జాల‌రివ‌ల‌, పాల‌ర‌థం, ఏనుగువ‌ల త‌యారైన ప్రాంతాల వ‌ద్ద గ‌ట్టి బందోబ‌స్తుతోపాటుప్ర‌తీ ఒక్కిరికీరెవిన్యూ శాఖ ఇచ్చిన గుర్తుంపుకార్డు ఉండే విధంగా చూడాల‌ని ఎస్పీ ఆదేశించారు. ఇక గ‌తేడాది క‌రోనా  ప్ర‌భావంతో భ‌క్తులెవ్వ‌రిని అనుమ‌తించ‌న‌లేద‌ని కానీ ఈ సారి  న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే  అనుమ‌తివ్వ‌డంతో…ర‌ద్దీ ఎక్కువ‌గాఉంటుంద‌ని త‌ద‌నుగుణంగానే బందోబ‌స్తు ఏర్పాటుచేయాల‌న్నారు.

మ‌రీ ముఖ్యంగా జిల్లాలోఉన్న 42 పోలీస్ స్టేష‌న్లలో..స్థానిక ప్ర‌జ‌ల‌కు..క‌రోనా దృష్ట్యా ..ఎవ్వ‌రూ న‌గ‌రంలోని రావొద్ద‌ని ఇప్ప‌టి నుంచీ త‌గు స‌మాచారాన్ని ఇవ్వాల‌ని ఎస్పీకోరారు.ఈ స‌మీక్షా స‌మావేశంలో ఎస్బీ సీఐ రాంబాబు,న‌గ‌ర డీఎస్పీ అనిల్, ఎస్టీఎస్టీ  డీఎస్పీ త్రినాధ్, వ‌న్ టౌన్,టూటౌన్,రూర‌ల్ సీఐలు ముర‌ళీ,లక్ష్మ‌ణ‌రావు,మంగ‌వేణిలు పాల్గొన్నారు.

Related posts

విక్రమ సింహపురి యూనివర్సిటీకి ఐఎస్ఓ ప్రమాణాలు

Satyam NEWS

ఎస్ వి హై స్కూల్ గ్రౌండ్ లో నిర్మాణాలు ఆపండి!

Satyam NEWS

భారీ ఎత్తున అక్రమ కలప దుంగలు స్వాధీనం

Satyam NEWS

Leave a Comment