27.7 C
Hyderabad
May 4, 2024 08: 38 AM
Slider కర్నూలు

శ్రీశైలం వద్ద కృష్ణా జలాల్లో విహరించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు

#srisailam

శ్రీశైలంలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రోప్ వే, శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో  కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు బుధవారం సాయంత్రం బోటింగ్  చేశారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థకు సంబంధించిన రోప్ వేలో వెళ్లి అర కిలోమీటరులో ఉన్న పాతాళ గంగ వరకు ప్రయాణించి రోప్ వే వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం పాతాళ గంగ వద్ద ఉన్న బోటులో కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి కూర్చొని  వెళ్లారు.

అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థకు సంబంధించిన గైడ్ శ్రీశైలం ప్రాజెక్టు, ఎడమ, కుడి పవర్ హౌస్ లు, కృష్ణా నది అందాలు, పాతాళ గంగ, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల చరిత్ర, నల్లమల అటవీ ప్రాంతం పై కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు వివరించారు. రోప్ వే మరియు బోటింగ్ లో కర్నూలు ఆర్ డి ఓ హరి ప్రసాద్, డిపిఓ ప్రభాకర్ రావు, ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ ఈశ్వరయ్య, అధికారులు పాల్గొన్నారు.

Related posts

గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు

Satyam NEWS

ఉక్రెయిన్ నుంచి వెనుదిరుగుతున్న రష్యన్ సేనలు?

Satyam NEWS

20 న జలిజపల్లె గంగమ్మ జాతర

Satyam NEWS

Leave a Comment