37.2 C
Hyderabad
May 6, 2024 20: 41 PM
Slider ప్రపంచం

ఉక్రెయిన్ నుంచి వెనుదిరుగుతున్న రష్యన్ సేనలు?

#ukraine

ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా యుద్ధం చాలించి వెనుదిరుగుతున్నదా? వస్తున్న వార్తలను బట్టి రష్యా సేనలు తోకముడిచి వెనక్కి వస్తున్నట్లే కనిపిస్తున్నది. రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందనుకున్న యుద్ధం నెలల తరబడి జరుగుతుండగా రష్యా సేనల్లో బలం సన్నగిల్లుతున్నది. ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నుండి రష్యన్ బలగాలు ఉపసంహరించుకున్నాయని వార్తలు అందుతున్నాయి.

దీంతో ఉక్రెయిన్ సైన్యం పురోగతి సాధించినట్లు కనిపిస్తున్నది. ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ (ISW) నుండి వచ్చిన నివేదికలు చూస్తే ఉక్రేనియన్ సాయుధ దళాలు ఈ నెల ప్రారంభం నుండి ఆ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయని తెలుస్తున్నది. ISW గత వారం తన అంచనాలో ఖార్కివ్ చుట్టూ ఉన్న ఉత్తర స్థావరాల నుండి రష్యన్ బలగాలు ఉపసంహరించుకోవడం కొనసాగించిందని, ఉక్రేనియన్ దళాలు రష్యన్ దళాలను నగరాన్ని చుట్టుముట్టకుండా నిరోధించాయని వెల్లడించారు.

కైవ్‌లో చేసినట్లుగానే నగరం చుట్టూ ఉన్న వారిని ఉక్రెనియన్ సేనలు తరిమికొట్టాయని కూడా రిపోర్టులో చెప్పారు. ఇప్పుడు రష్యా సెవెరోడోనెట్స్క్‌ను ఉత్తరం నుండి మరియు లైసిచాన్స్క్ ను దక్షిణం నుండి చుట్టుముట్టడంపై దృష్టి సారిస్తోందని కూడా ఈ సంస్థ అంచనా వేసింది. జాపోరిజ్జియా ప్రాంతంలో మోహరించిన రష్యన్ దళాలు చాలా తక్కువ ధైర్యాన్ని మరియు మానసిక పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని నివేదికలో పేర్కొన్నారు.

Related posts

మెగాస్టార్ ఆశీర్వాదాలు తీసుకున్న సోము వీర్రాజు

Satyam NEWS

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన ఏపీ మంత్రి వర్గం

Satyam NEWS

మహా ప్రతిభామూర్తి మహాభినిష్క్రమణం

Satyam NEWS

Leave a Comment