29.7 C
Hyderabad
May 1, 2024 10: 05 AM
Slider గుంటూరు

గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు

Collage Maker-16-Jul-2022-03.42-PM

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటారు బైక్ లను చోరీ చేయడమే వృత్తిగా పెట్టుకున్న ఒక ముఠాను పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో, నరసరావుపేట 1వ టౌన్, 2వ టౌన్, అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఆరు మోటారు సైకిళ్లను ఈ ముఠా చోరీ చేసింది.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో నరసరావుపేట మండలం దొండపాడు గ్రామానికి చెందిన పులి అంజిరెడ్డి, నరసరావుపేటలోని రామిరెడ్డిపేట బ్యాంకు కాలనీ కి చెందిన తన్నీరు ప్రసాదు ఉన్నారు. పులి అంజిరెడ్డి  B.Com వరకు చదివి ప్రస్తుతం గుంటూరు లో పాల డైరీ నడుపుతున్నాడు.

గతంలో తన పిన్ని కొడుకుని హత్య చేసిన కేసులో జైలుకి వెళ్లి వచ్చాడు. చెడు అలవాట్లతో గత సంవత్సరం నుండి గుంటూరు పట్టణం లోని అరండల్ పేట, ఓల్డ్ గుంటూరు, లాలాపేట ఏరియా లలో దొంగతనాలు చేసే క్రమంలో నరసరావుపేట రామిరెడ్డిపేట ఏరియా కి చెందిన తన్నీరు ప్రసాదు పరిచయం ఏర్పడింది.

తన్నీరు ప్రసాదు డిగ్రీ వరకు ఆన్లైన్ మార్కెటింగ్ ఉద్యోగం చేసే క్రమంలో పులి అంజిరెడ్డి పరిచయం కావడంతో దొంగతనాలు మొదలు పెట్టాడు. వీరిద్దరూ కలిసి సంవత్సర కాలంలో నుండి వివిధ ఏరియా లలో వివిధ కంపెనీ లకు చెందిన మోటార్ సైకిళ్ళను దొంగతనం చేశారు.

తరచూ జరుగుతున్న ఈ చోరీలను అరికట్టేందుకు పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు, నరసరావుపేట DSP సి.విజయ భాస్కరరావు, నరసరావుపేట 2వ టౌన్ CI S.వెంకటరావు ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేశారు.

నరసరావుపేట 2 వ పట్టణ CI ఆదేశాల మేరకు SI రబ్బాని, వారి సిబ్బంది ASI సుబ్బారావు, కానిస్టేబుల్సు వీరాంజనేయులు, తిరుమలరావు గుంటూరు రోడ్డులోని Y-జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అంజిరెడ్డి, తన్నీరు ప్రసాదు చోరీ మోటార్ సైకిల్ పై గుంటూరు వైపు నుండి నరసరావుపేట పట్టణంలోనికి వస్తుండగా పట్టుకున్నారు.

ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి వివిధ ఏరియా లలో దొంగిలించబడిన వివిధ కంపెనీ లకు చెందిన 7 మోటార్ సైకిళ్ళను స్వాధీనపరుచుకున్నారు. దొంగిలించబడిన 7 మోటార్ సైకిళ్ళ విలువ Rs.3,60,000/- ఉంటుందని పోలీసులు తెలిపారు.

మోటార్ సైకిళ్ళు చోరి కేసులో ముద్దాయిలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన CIవెంకటరావు. SI రబ్బాని ఖాన్, ASI సుబ్బారావు, కానిస్టేబుల్సు వీరాంజనేయులు, తిరుమలరావు లను DSP ప్రత్యేకంగా అభినందించారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫెదరర్

Satyam NEWS

వరద ముంపులో శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం

Satyam NEWS

విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం

Satyam NEWS

Leave a Comment