ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ఆయన పేరున అభిషేకం చేసి, స్వామి వారి దీవెనలను అందించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వర్ రావుతో పాటు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కూడా ఉన్నారు.
స్వామివారి దర్శనానతరం వారు దేవాలయ ప్రాంగణంలో కలియదిరుగుతూ అక్కడి ఆధ్యాత్మికతకు పరవశించిపోయారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవాన్ని స్మరించుకోవాలని సూచించారు. ప్రతిరోజు కాసేపైనా దేవుడి సన్నిధిలో గడపాలన్నారు. దైవచిత్తం లేనిదే ప్రపంచంలో ఏదీ జరగదని ఆయన తెలిపారు.