32.7 C
Hyderabad
April 27, 2024 01: 00 AM
Slider మహబూబ్ నగర్

పాత బస్టాండును వినియోగoలోకి తేవాలి

#oldbusstand

వనపర్తిలోని పాత బస్టాండులో  చైనా బజార్ షాపు వారితో మాట్లాడుతూ, వారికి దండ వేసి దండం పెట్టి షాపు త్వరగా కాళీ చేసి సహకరించాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ కోరారు. పాత బస్టాండు స్థలాన్ని పరిశీలిస్తూ, అక్కడ ఉన్న చైనా బజారు వారితో మీకు నోటీసులు వచ్చాయి కదా ఇంకా కాలీ చేయలేదు ఎందుకు అని అడగగా, మాకు ఇంకా నోటీసులు రాలేదు అని వారు చెప్పడంతో, అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఉంటే, ప్రజలే నిర్ణయాధినేతలు కనుక వారు చెప్పిందే వేధంగా భావించి త్వరగా ఖాళీ చేయలని, వారికి పూలమాలవేసి ప్రజల ఇబ్బందులను గుర్తించుకొని త్వరగా ఖాళీ చేయాలని కోరారు. అక్కడి నుండి నూతనంగా వచ్చిన ఆర్టీసి డి.ఎం. పరిమళను కలిసి  మర్యాదపూర్వకంగా పూల బోకే ఇచ్చి  వారికి పాత బస్టాండు గురించి వివరించారు. పాత బస్టాండు పూర్తి చేయాలని ఆర్డర్లు ఉన్నందున మేము చేయడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. ఆఫీసర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నెలలోగా పాత బస్టాండు పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తెచ్చి వారి ఇబ్బందులను తొలగించాలని కోరారు.

అలాగే అక్కడున్న  చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా వారికి సరియైన డబ్బాలతో షాపులు ఏర్పాటు చేసి ఇవ్వాలని డిపో మేనేజర్ ను కోరారు. వనపర్తి పాత బస్టాండు త్వరగా వినియోగంలోకి తెచ్చి ప్రజలు ఎండ,వానకు రోడ్లపై నిలబడి పడుతున్న కష్టాలను దూరం చేయాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషను, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షుడు వెంకటేష్, జయ రాములు, మైనార్టీ అధ్యక్షుడు షఫీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రమౌళి, రాజనగరం రాజేష్, అడ్వకేట్ ఆంజనేయులు, వైయస్సార్ సతీష్ పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ డైరీ ఆవిష్కరించిన కెప్టెన్ ఉత్తమ్

Satyam NEWS

ఇప్పటికైనా రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టండి

Satyam NEWS

20 లక్షల ఎకరాల అసైన్ భూమిపై కేసీఆర్ కన్ను పడింది

Satyam NEWS

Leave a Comment