29.7 C
Hyderabad
May 3, 2024 04: 18 AM
Slider కరీంనగర్

తెలంగాణ లో రెండో అతిపెద్ద ఐటీ టవర్‌

gangula 21

కరీంనగర్‌కు మణిహారంగా మారుతున్న ఐటీటవర్‌ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఈనెల 30న  దీన్ని ప్రారంభించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఐటీ టవర్‌ తుది దశ పనులను నేడు ఆయన పరిశీలించారు.

ఐదో అంతస్తు వరకు పూర్తిచేసిన పనులను చూసి, అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ లక్ష్యానికి అనుగుణంగా, కరీంనగర్‌లో ఐటీటవర్‌ ఏర్పాటు చేశారన్నారు.

స్థానిక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇంటి నుంచే ఐటీ జాబ్‌లు చేసుకునే అవకాశం ఉందన్నారు. చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయని, ఈనెల 28 వరకు వాటిని పూర్తి చేస్తామన్నారు. ఈ టవర్‌ తన పూర్తి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రెండో ఐటీ టవర్‌ ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్‌ హమీ ఇచ్చారని, ఇతర దేశాల నుంచి వచ్చే కంపెనీల డిమాండ్‌ను బట్టి మరో టవర్‌ నిర్మించడానికి చర్యలు చేపడతామని తెలిపారు.

 మూడెకరాల స్థలంలో 7అంతస్తులతో తెలంగాణలోనే ఇది రెండో అతిపెద్ద టవర్‌ అని మంత్రి తెలిపారు. రెండు సెల్లార్లు, మొదటి అంతస్తులో రిసెప్షన్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, క్యాంటిన్, రెండోఅంతస్తు నుంచి ఏడోఅంతస్తు వరకు కార్యాలయం కోసం నిర్మించామన్నారు. ప్రతిషిప్ట్‌లో 12వందల చొప్పున 3600 మంది ఉద్యోగం చేసేలా సౌకర్యాలు కల్పించామన్నారు.

60నుంచి 70కార్లు పార్కింగ్‌ చేయడానికి భవనంలోనే ఏర్పాట్లున్నాయని తెలిపారు. ఇప్పటికే 11కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని, మరో మూడు కంపెనీలతో రెండురోజుల్లోనే ఒప్పందం చేసుకుంటామన్నారు. సాధ్యమైనంత వరకు 80శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈనెల 30న ఐటీ టవర్‌ ప్రారంభోత్సవానికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఇతర నాయకులను ఆహ్వానిస్తున్నట్లు  గంగుల కమలాకర్‌ తెలిపారు.

Related posts

భారీ గా పడిపోయిన అడ్మిషన్లు

Bhavani

భారత్ అమెరికన్ క్రియేషన్స్ బహు భాషా చిత్రం “భారతీయన్స్”

Bhavani

శిక్షణలో క్షేత్రస్థాయి సందర్శన అత్యంత కీలకం

Sub Editor 2

Leave a Comment