36.2 C
Hyderabad
May 15, 2024 17: 50 PM
Slider ఆధ్యాత్మికం

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం

#chekrasnanam

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన సోమ‌వారం ఉదయం ఆల‌య ప్రాంగ‌ణంలోని పుష్క‌రిణిలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో ఊరేగింపుగా పుష్క‌రిణి వ‌ద్ద‌కు వేంచేశారు.

అనంతరం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

కాగా రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో రమణప్రసాద్, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్  పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్  ధనుంజయ, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ క్రీడల విజేతలకు ములుగు కలెక్టర్ సత్కారం

Satyam NEWS

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే: రాజమండ్రి వైసీపీలోనూ రచ్చ రచ్చ…

Satyam NEWS

నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ కు దర్శనం

Satyam NEWS

Leave a Comment