40.2 C
Hyderabad
May 2, 2024 16: 14 PM
Slider గుంటూరు

నల్లగార్లపాడు రోడ్డు బాగుచేయించండి మహా ప్రభో……

#rameshkumar

నల్లగార్లపాడు రోడ్డు బాగుచేయించండి మహా ప్రభో అంటూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు డీబీహెచ్ పీయస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు.

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి దళిత బహుజనులు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. నల్లగార్లపాడు రోడ్డు బాగుచేయించండి మహా ప్రభో అంటూ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో రొంపిచర్ల మండలం నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర్ వాసులు స్పందన కార్యక్రమానికి వచ్చారు.

ప్లకార్డులతో నిరసన తెలుపుతూ పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ని కలసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం డా॥గోదా రమేష్ కుమార్ కలెక్టర్ తో మాట్లాడుతూ రావిపాడు నుండి నల్లగార్లపాడు వెళ్ళే రహదారి పూర్తిగా గుంతలమయమైందని కనీసం కాలినడకన గ్రామానికి చేరాలన్న వీలుపడే పరిస్థితి లేదని ఈ రహదారిలో ఇప్పటికే హైస్కూళ్ళలో,కాలేజ్ లలో చదివే విద్యార్థినీ,విద్యార్థులు సైకిళ్ళపై,బైక్ లపై వెళ్తూ రోడ్డు ప్రమాదాలకు గురై కాళ్ళు,చేతులు విరిగిన సంధర్భాలు ఉన్నాయని అన్నారు.

ఇద్దరు మృతి చెందిన సంధర్భాలు ఉన్నాయని, సుమారుగా 10 సంవత్సరములపైగా ఈరోడ్డు మరమ్మత్తులకై నల్లగార్లపాడు గ్రామ అంబేద్కర్ నగర్ వాసులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గర్భిణీ స్త్రీలు కనీసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళేలోపే ప్రసవం జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నామని ఆయన అన్నారు.

వర్షాకాలంలో ఆయా రోడ్డుపై గుంతలలో నీరు చేరడంతో ప్రయాణికులు ఆయా గుంతలలో పడి ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ఈ రోడ్డు వేయడానికి 68లక్షల 26వేలకు గుంటూరుకు చెందిన వెన్నా రవీంద్రారెడ్డి అనే కాంట్రాక్టర్ టెండర్ వేసి సంవత్సరం నుండి పనులు చేపట్టడంలేదని ఆయన తెలిపారు.

గతంలో రెండు మూడు సార్లు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్ తో మాట్లాడినా కంట్రాక్టర్ అదుగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని తక్షణమే నల్లగార్లపాడురోడ్డు మరమ్మత్తులు చేయించాలని కోరారు. వెంటనే పల్నాడు జిల్లా కలెక్టర్ సంబంధిత ఈఈని పిలిచి తక్షణమే రోడ్డును పరిశీలించి రోడ్డు మరమ్మత్తు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొమ్మాలపాటి శేషగిరి,కొమ్మాలపాటి మాణిక్యరావు,ఈదర గోపీచంద్,పి.సతీష్ కుమార్,హరనాధ్,సిహెచ్ అనురాధారెడ్డి,యర్రంశెట్టి వెంకట నరసింహారావు,న్యాయవాది వంకాయలపాటి రవి తదితరులు పాల్గొన్నారు

Related posts

పశువుల వ్యర్ధాలతో నూనె, సబ్బుల తయారీ కంపెనీ సీజ్

Satyam NEWS

రేపటి నుండి మేడారం మినీ జాతర

Bhavani

ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా మాస్కుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment