39.2 C
Hyderabad
May 4, 2024 22: 40 PM
Slider ముఖ్యంశాలు

4,5 తేదీలలో గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

#chandrababu

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మే 4,5 తేదీలలో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు పరామర్శిస్తారు. చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలను బుధవారం సాయంత్రం టిడిపి రాష్ట్ర కార్యాలయం విడుదల చేసింది.

మే 4వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి చంద్రబాబు బయలుదేరి 12 గంటలకు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బెండపూడి కాలువ గట్టు రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ 1.30 గంట వరకూ వర్షం ముంపునకు గురైన వరి చేలను ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామానికి చేరుకుని ముంపునకు గురైన పొలాలను పరిశీలిస్తారు.

అక్కడ నుండి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం చేరుకుని చంద్రబాబు రాత్రికి ఎన్.వి.ఆర్. ఫంక్షన్ హాలులో బస చేస్తారు. 5వ తేదీ ఉదయం ఎన్.వి.ఆర్ ఫంక్షన్ హాలు నుండి బయలుదేరి ఉదయం 10.15 గంటలకు రామచంద్రపురం మండలం వెంగయ్యమ్మపేటకు చేరుకుని అక్కడ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కడియంలో పంట పొలాలను పరిశీలిస్తారు.

సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుని రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ లతో చంద్రబాబు ములాఖత్ అవుతారు. అనంతరం రాజమహేంద్రవరం నగరం తిలక్ రోడ్డులోని ఆదిరెడ్డి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మలను పలుకరించి చంద్రబాబు వారికి ధైర్యం చెబుతారు. సాయంత్రం 6.45 గంటలకు మధురపూడి ఎయిర్ పోర్టుకు చేరుకుని విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళతారు.

Related posts

ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులు అర్పించిన టిఎన్ టియుసి ప్రధాన కార్యదర్శి

Satyam NEWS

క్రైస్తవ సోదరులకు సీఎం కేసీఆర్ కానుక: దానం నాగేందర్

Satyam NEWS

ఉత్సాహంగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర

Bhavani

Leave a Comment