35.2 C
Hyderabad
April 27, 2024 13: 52 PM
Slider సినిమా

ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ కి దాసరి ప్రతిభా పురస్కారం

#dheerajaappaji

దివంగత దర్శకరత్నం డాక్టర్ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లోజరిగిన “దాసరి ఫిల్మ్ అవార్డ్స్” ప్రదానోత్సవంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – ఎనలిస్ట్ ధీరజ అప్పాజీ “దాసరి ప్రతిభా పురస్కారం” అందుకున్నారు. వి.వి.వినాయక్, సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, అలి, టి ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, డా: రఘునందన్ (దాసరి అల్లుడు), రాజా వన్నెంరెడ్డి, రైటర్ రాజేంద్ర కుమార్ తదితర సినీ దిగ్గజాలు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో… ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, డాక్టర్ బ్రహ్మానందం, సీనియర్ దర్శకులు ముత్యాల సుబ్బయ్య, ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్, బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి, వంశీ రామరాజు, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్, సుప్రసిద్ధ ఫిల్మ్ జర్నలిస్ట్ – సుమన్ టివి సినిమా విభాగం క్రియేటివ్ హెడ్ ప్రభు ప్రతిష్టాత్మక దాసరి ప్రతిభా పురస్కారాలు స్వీకరించారు. ప్రముఖ నిర్మాత – భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సారథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ వేడుకలో ఆంధ్ర, తెలంగాణలో పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న బహుముఖ ప్రతిభావంతులకు కూడా ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.

Related posts

రాష్ట్రం లో మైనార్టీలకు రక్షణ లేదు: టిడిపి నాయకులు

Satyam NEWS

సింహాచలం ల్యాండ్ స్కాం లపై బిగుస్తున్న విజిలెన్స్ ఉచ్చు

Satyam NEWS

ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం నేరుగా చర్చలు జరపాలి

Satyam NEWS

Leave a Comment