42.2 C
Hyderabad
April 30, 2024 16: 55 PM
Slider నిజామాబాద్

ఉత్సాహంగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర

కామరెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర రెండో రోజు సోమవారం ఉదయం 6 గంటల నుండి బిచ్కుంద మండలంలోని ఫతలపుర్ గ్రామం నుండి బయలుదేరింది,161 జాతీయ రహదారి గుండా కొనసాగుతున్న ఈ యాత్రలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగంచల భద్రత మధ్య యువరాజు పాదయాత్ర కొనసాగుతున్నది. మండలంలోని కందర్ పల్లి, రాజుల చౌరస్తా, ఎకలార గేట్, తర్వాత టీ విరామం తీసుకున్నారు. పది నిమిషములు తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కొడిచిరా గేట్ నుండి లచ్చన్ గేట్ వరకు పాదయాత్ర కొనసాగింది అనంతరం వీరంమం తీసుకున్నారు. విరమ అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మేనూరు గ్రామంలో జరిగే మహాసభలో

ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో రాహుల్ గాంధీతోపాటు, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్,మాజీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, బలరాం నాయక్, బల్మూరి వెంకట్, టిపిసిసి ఐటీసీఎల్ నాయకులు మదన్మోహన్, మాజీమంత్రి షబ్బీర్ అలీ, సినియర్ నాయకులు, పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,మాజీ ఎంపీ సురేష్ షేట్కార్ ,గడుగు గంగాధర్, జుక్కల్ మాజీ శాసనసభ్యులు గంగారం, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మధుయస్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ డెలిగేట్ సభ్యులు సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, నాగనాథ్, వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జిల్లాల నుండి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు.

జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

శవమై కనిపించిన బెంగాలీ టీవీ నటి పల్లవి

Satyam NEWS

110 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

Sub Editor

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో షాక్

Satyam NEWS

Leave a Comment