28.7 C
Hyderabad
May 5, 2024 08: 50 AM
Slider విజయనగరం

లేత వయస్సు లో ఖతర్నాక్ ఆలోచనలు…సీన్ కట్ చేస్తే….

#vijayanagaram police

మీరు రోడ్డు మీద బండిపై వెళుతుంటే ఏ అమ్మాయి అయినా కనిపించి లిఫ్ట్ అడిగింది…!వెంటనే జాలి పడి లిఫ్ట్ ఇచ్చారో….మీ పని గోవిందా…గోవింద. ఏంటి ఇలా చెబుతున్నారేంటని అనుకోకండి. విషయమే ఉంది..అక్కడకే వస్తున్నా..కాదు.. కాదు.. విజయనగరం సబ్ డివిజన్ పోలీసు అధికారే స్వయంగా ఈ విషయం చెప్పారు.

19 ఏళ్ల అమ్మాయి… నగరంలో ఐస్ ఫ్యాక్టరీ వద్ద లిఫ్ట్ అడిగి తీరా గమ్యస్థానం రాగానే… నన్ను ఏడిపించావని కేసు పెడతా…అలా కాకపోతే డబ్బులు ఇవ్వమని దబాయించి మరీ అడిగింది. అక్కడితో ఆగక వంటిపై బంగారు ఉంగరాలను కూడా లాక్కుంది.

దీంతో భయాందోళన చెందిన అతగాడు టూటౌన్ సీఐ లక్ష్మణరావు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సమీప పరిసర ప్రాంతాల్లో సీసీ కెమారను పరిశీలిస్తే 19 ఏళ్ల అమ్మాయి కనిపించడంతో తీగ లాగితే ఆ అమ్మాయి బండారం బయటపడింది.

సీన్ కట్ చేస్తే…శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకుంది. ఆ వివరాలను డీఎస్పీ అనిల్ ,సీఐ లక్ష్మణరావు మీడియా సమావేశం పెట్టి మరీ  వివరించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిఫ్ట్ అడిగి అనంతరం బెదిరింపులకు పాల్పడుతున్న మహిళను అదుపులోకి తీసుకున్నాం అని తెలిపారు.

గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ విజయనగరం పోలీస్ స్టేషన్ పరిధి ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద  ఓ వాహన దారుని లిఫ్ట్ అడిగి తీరా ఆయన లిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళాక తనపై అఘాయిత్యానికి పాల్పడవు అని ఫిర్యాదు చేస్తాను అంటూ బెదిరించి ఆయన వద్ద నుండి 5 వేలు నగదు, చేతికి ఉన్న పావుతులం బంగారు ఉంగరం డిమాండ్ చేసి తీసుకుపోయినట్టు ఈ నెల 21 వ తేదీన రెండవ పట్టణ పోలీస్ స్టేషన్  లో  బాధితుడు ఫిర్యాదు చేశాడు.

సీసీ కెమెరాలు సహాయంతో దర్యాప్తు చేసిన రెండవ పట్టణ  పోలీసులు నిందుతురాలుని  అదుపులోకి తీసుకున్నారు. రోజువారి కూలీగా పనిచేస్తూ మద్యానికి బానిసవడంతో  కెల్లకు చెందిన లక్ష్మి బెదిరింపులకు పాల్పడేది.

ఇదివరకే పలు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే ఇప్పటివరకు కేసులు ఏమి లేవు అని,  ఇదే మొదటి కేసు అని పోలీసులు తెలిపారు.  ఈ సందర్భంగా రెండవ పట్టణ పోలీసులు,  సిబ్బంది ని అభినందించారు.

Related posts

‘జాన్ సే…’ చిత్రానికి కథే ప్రధాన హీరో..

Bhavani

భార్య కోసం చెమటోడుస్తున్న అఖిలేష్ యాదవ్

Satyam NEWS

లాఠీలు పక్కన పెట్టి… ప్లకార్డులు పట్టుకుని “క్లాస్” చెబుతున్నఖాకీలు…!

Bhavani

Leave a Comment