27.7 C
Hyderabad
April 30, 2024 09: 06 AM
Slider విజయనగరం

లాఠీలు పక్కన పెట్టి… ప్లకార్డులు పట్టుకుని “క్లాస్” చెబుతున్నఖాకీలు…!

#policemen

మీరు చదివిన క్యాప్షన్ కరెక్టే. అదేంటీ వెపన్స్ ,లాఠీలు పట్టుకోవలసిన పోలీసులు…ఇలా ప్లకార్డులు.. అలాగే “క్లాస్ “చెబుతున్న రేంటని నోరెళ్లబెట్టకండి.ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ భద్రతా వారోత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా రాష్ట్రం అంతటా వారం రోజుల పాటు పోలీసులు…

రహదారి భద్రతా గురించి ప్రజలలో చైతన్యం కల్పించేందుకు “తరగతులు ” తీసుకోవాలని రాష్ట్ర పోలీసు శాఖ పేర్కొన్న ఆదేశాలతో ప్రతీ జిల్లా లోనూ సంబంధిత పోలీసు బాస్ సూచనలతో అటు లా అండ్ ఆర్డర్, ఇటు ట్రాఫిక్ పోలీసులు… అవగాహన తరగతులు దాంతో పాటు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా నే విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా ఆదేశాలు తో అటు వన్ టౌన్ పోలీసులు,ఇటు ట్రాఫిక్ పోలీసులు…

తరగతులు ఒక వైపు ర్యాలీలు ఒకవైపు నిర్వహించారు. ఈ క్రమంలో రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు చైతన్య పాఠశాలను సందర్శించారు.

ఆ కాలేజ్ విద్యార్థులతో ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించి, ప్రజలకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించారు. ఆటో మరియు లారీ డ్రైవర్లు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ప్రమాదాల నియంత్రణకు భద్రత నియమాలు పాటించాలని కోరారు. ఈ ర్యాలీలో ట్రాఫిక్ ఎస్ఐ లు దామోదర్, హరిబాబు నాయుడు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణాలో 7వ శాఖను ప్రారంభించిన సానీ ఇండియా

Satyam NEWS

ఎల్లారెడ్డి లో గులాబీ జెండా ఎగరడం ఖాయం

Satyam NEWS

అంతర్గత భద్రతపై పరస్పర సహకారం

Satyam NEWS

Leave a Comment