33.7 C
Hyderabad
April 30, 2024 00: 46 AM
Slider ఖమ్మం

ప్రజా నమ్మకమే అధునిక పోలీస్ వ్యవస్థకు పునాది

#khammam police

ప్రజా నమ్మకమే అధునిక పోలీస్ వ్యవస్థకు పునాది అని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అడ్డగూడురు పోలీస్ స్టేషన్ ఘటనలో ఖమ్మం నగరంలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ కిరణ్ ను పరామర్శించేందుకు రాష్ట్ర డీజీపీ, నార్త్ జోన్ ఐజీపీ వై.నాగిరెడ్డి తో కలసి ఆదివారం  హెలికాప్టర్ లో జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆర్వి. కర్ణన్,పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ కలసి సంకల్ప ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

అనంతరం జిల్లాలోని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ,త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ,కొణిజర్ల పోలీస్ స్టేషన్ ,పోలీస్ హెడ్ క్వార్టర్స్ MT సెక్షన్ ను అకస్మికంగా  సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ ….ఏ పోలీస్ స్టేషన్ కెళ్లిన ఒకేవిధమైన స్పందన, ఏకీకృత సేవలు అందుస్తూ పారదర్శకతను విస్తరింపజేయడం పోలీసుల లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా నిష్పక్షపాతంగా సేవలందించాలని అన్నారు.

నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో  ప్రజామోదం లభించటం  ద్వారానే విధినిర్వహణ సామర్థ్యం ఆధారపడి ఉంటుందని తెలిపారు. పోలీసు శాఖపై ప్రజలకు విశ్వాసం పెరిగిననాడే నేరాలను పూర్తిస్థాయిలో అదుపు చేయవచ్చునని అన్నారు.

రక్షణ కోసం వచ్చిన బాధ్యతల పట్ల మానవీయ కోణంలో  వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు. 14 ఫంక్షనల్  వర్టికల్స్, 5 s విధానాన్ని , లీడర్ షిప్ క్వాలిటీ  అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న  ప్రతిఒక్కరికి పని విభజన చేసి  ఖచ్చితమైన బాధ్యతలు  అప్పగించటం జరిగిందని తద్వారా తమకు అప్పగించిన  పని తానే  చేయాలనే తపనతో  జవాబుదారీతనం  వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ లో  రిసెప్షన్ స్టాప్,  స్టేషన్ రైటర్స్,  క్రైమ్ రైటర్స్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ కార్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ , టెక్నికల్ టీమ్, క్రైమ్ స్టాప్ తదితర విభాగాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వారి యొక్క విధివిధానాలను ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు.

Related posts

స్ఫూర్తి జితేందర్ “ఐ ఫీల్ యు” ఆల్బమ్ పోస్టర్ ఆవిష్కరణ

Bhavani

కరోనా సోకిన వృద్ధురాలు అంబులెన్స్ చూసి ఆకస్మిక మృతి

Satyam NEWS

మద్యం షాపులు తెరిచి రాష్ట్రాన్ని ఆగం చేశారు

Satyam NEWS

Leave a Comment