23.2 C
Hyderabad
May 8, 2024 01: 52 AM
Slider నల్గొండ

నవంబర్ 3న పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయండి

#chellodelhi

నిరుద్యోగ సమస్యలపై నవంబర్ 3న చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేళ్ళచెరువు మండల డివైఎఫ్ఐ కార్యదర్శి భావన ఆదినారాయణ ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగం,ఉపాధి,నిరుద్యోగులకు అందించాలని ఈ ముట్టడి ఉంటుందని, దేశంలో ఉన్న యువత తమ హక్కు కోసం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని,యువతి,యువకులు, నిరుద్యోగులు పాల్గొనాలని ఆయన కోరారు.

దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారని,మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు మొండి చేయి చూపిందని,బిజెపి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని,ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని ప్రైవేటు పరం చేయడానికి ఈ సర్కారు సిద్ధంగా ఉందని,బిజెపి ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత రైల్వే,బ్యాంకింగ్ సేవా రంగాలు,బిఎస్ఎన్ఎల్, విమానాశ్రయాలు ఇలా అనేక శాఖలను ప్రవేట్ పరం చేయడంలో ముందుందని, తద్వారా దేశంలో ఉన్న యువతకు ఉద్యోగాలు లేక రోడ్డున పడిన పరిస్థితి ఉందని,అదేవిధంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వము వాటిని ప్రవేట్ పరం చేయడంలో ముందుందని,యువత ఉపాధి,ఉద్యోగం లేక దేశంలో నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, బ్యాంకింగ్,పోస్టల్,కొల్ మెయిన్స్, బిఎస్ఎన్ఎల్,ఎల్ఐసి సేవా రంగాలు, విమానాశ్రయాలు,ఇలా అనేక శాఖలలో కొన్ని కోట్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తుందని వాపోయారు.దేశంలో నిరుద్యోగులు, ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలు చూపకుండా,దేశంలో మత ఘర్షణలు సృష్టిస్తూ నిరుద్యోగం మాట పక్కన పెట్టి మతం,కులం పేరును ముందుకు తెచ్చి యువతలో మతోన్మాదాన్ని సృష్టించే ప్రయత్నం అనేక రకాలుగా చేస్తుందని అన్నారు.

దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని నిరుద్యోగ యువత పసిగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ వాటిని ఇచ్చేంత వరకు, నోటిఫికేషన్లు వేసే వరకు యువత కదం తొక్కుతూ,పదం పాడుతూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని,మోడీ సృష్టిస్తున్న మత ఘర్షణలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు యువతి యువకులు ముందుకు రావాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న నిరుద్యోగ సమస్యలపై చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని హక్కులను సాధించుకోవాలని కోరారు.డివైఎఫ్ఐ సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు జరగబోయే కార్యక్రమం కి ఆర్థిక,హార్ధిక,సహాయ సహకారాలు అందించాలని సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు డివైఎఫ్ఐ మండల కమిటీ కార్యదర్శి భావన ఆదినారాయణ ఒక ప్రకటనలో కోరారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

23న హైదరాబాద్ లో ఎగుమతులను పెంచడానికి వాటాదారుల ఔట్రీచ్

Satyam NEWS

కరోనా ఎలర్ట్: కరోనా తో బ్యాంకు మేనేజర్ మృతి

Satyam NEWS

బాధ్యతలు స్వీకరించిన సీబీఐకి కొత్త చీఫ్‌

Satyam NEWS

Leave a Comment