33.2 C
Hyderabad
May 4, 2024 00: 15 AM
Slider తూర్పుగోదావరి

ముంపు మండలాల ప్రజల వినూత్న నిరసన

#flood

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రము లోని శబరి ఒడ్డు వాసులు వరదనీటిలోనే నిరసనకు దిగారు….కలెక్టర్ రావాలి,మా భాద వినాలి… అంటూ నీటిలోనే ఉంటూ నినాదాలు చేశారు.కలెక్టర్ వచ్చే వరకు మేము ఇక్కడి నుండి కదిలేది లేదు అంటూ..ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు….

వివరాల్లోకి వెళ్తే ….మునుపు జూలై నెలలో వచ్చిన వరదల్లో సర్వం కోల్పోయిన చింతూరు గోదారి ఒడ్డు  వాసులు పునరావాసం, భూ నష్టపరిహారం ,అర్&అర్ ప్యాకేజీల విషయంలో ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

వరదల తరువాత ముఖ్యమంత్రి పర్యటనలో వై .ఎస్ జగ్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ వలన కాంటూరు లెవెల్ 41.5 వరకు మాత్రమే నష్టపరిహారాన్ని ఇస్తామని ,మిగతా ముంపుకు గురవుతున్న గ్రామాలకు కేంద్రం నిధులు కేటాయిస్తే ఇస్తామని హామీ ఇచ్చారు….అసలు సరైన వర్షాలు పడలేదు,వాగులు  పొంగలేదు  …ఎగువన ఉన్న ప్రాజెక్టుల నీరు రావడంతోనే  జూలై నెలలో సర్వం కొల్పోయం….మళ్ళీ ఇప్పుడు కూడా….అదే …విధంగా వరద ముంచేస్తుంది…

కళ్లముందు వరద ముంచెస్తు ఉంటే….కాంటూరు 41.15 లెవెల్ వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని అనడం సరైనది కాదు….అని ప్రజలు మండి పడుతున్నారు….మమ్మల్ని దయచేసి కాంటూరు 45లెవెల్ నుండి 41.15 లోకి చేర్చి   నష్టపరిహారం చెల్లించాలని….నీటి ప్రవాహ మధ్యలో మరియు రోడ్డు మీద బైఠాయించి చింతూరు వాసులు నిరసనలను తెలియజేశారు.

Related posts

రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

మైనారిటీలకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు: షబ్బీర్ అలి

Satyam NEWS

డిసెంబర్ 4న శ్రేయాస్ ఎటిటి ద్వారా “రాంగ్ గోపాల్ వర్మ” విడుదల

Satyam NEWS

Leave a Comment