38.7 C
Hyderabad
May 7, 2024 17: 19 PM
Slider నల్గొండ

చిన్నతనం నుండి సేవా దృక్పథం అలవర్చుకోవాలి

#cituc

భూ ప్రపంచంలో అనాధలని చేరదీసి ఒక కుటుంబ సభ్యులుగా విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో గౌరవంగా జీవించేలా చేసే కృషి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే గొప్పదని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి అన్నారు.

అలాంటి కొవకి చెందినది 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ‘యాపిల్ స్వచ్ఛంద సేవా సంస్థ’ అని శీతల రోషపతి కొనియాడారు. విజయవాడ మహా నగరంలో గుణదల నందు యాపిల్ స్వచ్ఛంద సేవ సంస్థలో ఉన్న సుమారు 35 మంది అనాధ బాలబాలికలకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ శీతల అఖిల,కేతబోయిన భువనేశ్వరి,గడ్డం మీనా,కుక్కడపు సంతోషి,అల్లాడ సీతామహాలక్ష్మి,జి.వెంకట సాయి మురళి, ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో ఒకరోజు భోజన సౌకర్యం కల్పించారు.

చిన్న వయసులో అనాధల పట్ల సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని పలువురు ప్రశంసించారు. ఇలాంటి అనాధాశ్రమంలో ఉన్న పిల్లలకి చేతనైనంత సహకారం చేయుటకు మానవతా మూర్తులు ఆదర్శవంతులైన వారు స్వచ్ఛంద సంస్థలు వివిధ రూపాల్లో ఆదుకోవాలని చిన్నారులు కోరారు.

ఈ సంస్థను నిర్వహించే అధ్యక్షుడు ఎం స్నేహలత చిన్నారులను ఆశీర్వదించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

హుజూర్ నగర్ సత్యం న్యూస్

Related posts

భూ కబ్జాలపై టీడీపీ నేత భత్యాల ఆగ్రహం…

Bhavani

వైసీపీ అరాచకాలపై పల్నాడు గ్రామాలలో పోలీసుల ప్రేక్షక పాత్ర

Satyam NEWS

బెస్ట్ సోషల్ సర్వీసర్ గా డా.కె.అనితారెడ్డి ఎంపిక

Satyam NEWS

Leave a Comment