కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం అవసరమని మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోందని, మరింత అప్రమత్తత అవసరమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కొన్ని ముందస్తు నివారణా చర్యలు ప్రారంభించినట్టు తెలిసిందని ఆయన అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా వైస్ జగన్ మోహన్ రెడ్డి తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. సినిమా షూటింగ్స్ లో కూడా పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్స్ వాయిదావేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అని ఆయన అన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతున్న తన సినిమా షూటింగ్ ని వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివ తో చెప్పినప్పుడు ఆయన వెంటనే అంగీకరించారని చిరంజీవి అన్నారు.