కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ పరిధిలో ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడానికి చాల కారణాలు ఉన్నాయని రాజంపేట టీడీపీ ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు అన్నారు. వైసీపీ నాయకులు చేసే దౌర్జన్యాలు అంతా ఇంత కాదని టీడీపీ కార్యకర్తలను ప్రతి ఒక్కరినీ అద్దరాత్రి సమయంలో ఇంటికి వెళ్లి బెదిరించడం, లొంగకపోతే అనవసర కేసులు పెట్టడం చేసారని తెలిపారు.
రాజంపేట, కోడూరు నియోజకవర్గాలలో కార్యకర్తలకు తాను ఎంతో భరోసా ఇచ్చి, ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చినా కూడా వారిని ఏమీ చేయలేక కావాలనే వారు వేసిన నామినేషన్ పత్రాలను పరిశీలనలో రిజెక్ట్ చేశారన్నారు. టీడీపీ వారు వేసిన నామినేషన్ దాఖలును కనపడకుండా చేసి, టీడీపీ అభ్యర్ధుల దగ్గర నామినేషన్ వేసినట్లు రసీదు ఉన్నా పట్టించుకోలేదని అన్నారు.
మీరు అసలు నామినేషన్ వేయలేదని అధికారులే చెప్పడం, వైసీపీ(అధికార పార్టీ) వారికి కొమ్ముకాసి తప్పుగా ఎన్నికల అధికారులు రిపోర్టులు ఇవ్వడం ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అదీ కుదరకపోతే తప్పుడు కేసులు బనాయించడం ఇలా టీడీపీ తరుపున నామినేషన్ వేసిన వారిని చాల ఇబ్బందులకు గురిచేసారని భత్యాల చెంగల రాయుడు అన్నారు.