33.2 C
Hyderabad
May 14, 2024 11: 37 AM
Slider నల్గొండ

స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం సిఐటీయూ బైక్ ర్యాలీ

CITU Bike Rally

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కృష్ణ పట్టె ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రియా సిమెంట్, జువారి సిమెంట్ ఫ్యాక్టరీల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. వారితోపాటు మిగిలిన పరిశ్రమల వారు పాల్గొన్నందుకు కార్మికులందరికీ జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

రామాపురంలో కార్మికులతో బైక్ ర్యాలీతో గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వేజ్‌ బోర్డ్ తక్షణమే అమలు చేయాలని, ఐదు సంవత్సరాలు దాటిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అట్లే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చట్టాల సవరణ, పని గంటల విధానంలో మార్పులు, రైతులపై దాడి తక్షణమే విరమించుకోవాలని, లేకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు తీగల శ్రీను, అజముద్దీన్, ప్రకాష్, అంకారావు, సురేష్, లక్ష్మయ్య, వీరబాబు, తదితర కార్మికులు పాల్గొన్నారు.

Related posts

భగీరథ ను అభినందించిన చంద్ర బాబు నాయుడు

Satyam NEWS

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కు కొత్త కమిటీ

Satyam NEWS

అనంతపద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం

Satyam NEWS

Leave a Comment