30.7 C
Hyderabad
April 29, 2024 04: 33 AM
Slider హైదరాబాద్

రేవంత్ రోడ్‌షో.. భారీగా హ‌జ‌రైన ప్ర‌జ‌లు

Revanth Reddy

హస్తినాపూరం డివిజన్లో యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్ షోకు భారీగా ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. హస్తినాపూరం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంగీత శశిధర్ రెడ్డికి మద్దతుగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రచారానికి హాజ‌రై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తా నుండి వయా ZP రోడ్ మీదుగా నందనవనం వరకు వందలాది బైక్ లతో వేలాది మంది రోడ్ షోలో పాల్గొనగా అనంతరం నందనవనం చౌరస్తాలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు.

హస్తినాపూరం డివిజన్ అభివృద్ధి చెందాలంటే నా చెల్లెలు సంగీత శశిధర్ రెడ్డిని గెలిపించాలని మీకు ఎల్లవేళలా అండగా ఉంటానని రేవంత్ హామీనిచ్చారు. హ‌స్తం గుర్తుకే ఓటేయ్యాల‌న్నారు. టీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అంట‌కాగి ఓట‌ర్ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా నాట‌కాలాడుతున్నాయ‌ని విమ‌ర్శించారు. ఆయ‌న చేప‌ట్టిన రోడ్‌షోకు ఆసాంత‌రం జ‌నాద‌ర‌ణ ల‌భించ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా సంగీత – శశిధర్ రెడ్డికే ఓటు వేయాల‌ని రేవంత్ పిలుపునిచ్చారు.

Related posts

ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం

Satyam NEWS

కిల్లింగ్: జర్నలిస్టు సునీల్ రెడ్డి దారుణ హత్య

Satyam NEWS

Another calamity: మిడతల దాడి బెడద దేశాన్ని వదల్లేదు

Satyam NEWS

Leave a Comment