27.7 C
Hyderabad
May 4, 2024 10: 40 AM
Slider నల్గొండ

శిల్పకళ, బిల్డింగ్ వర్కర్స్ కుటుంబాలను ఆదుకోవాలి

#CITUHujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సి ఐ టి యు అనుబంధ తెలంగాణ శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం మంగళవారం ఉప్పతల గోవిందు అధ్యక్షతన టౌన్ హాల్ లో జరిగింది.

ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా భవన, ఇతర నిర్మాణ కార్మిక సి ఐ టి యు అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఏర్పడిన లాక్ డౌన్ నాటి నుండి  నేటి వరకు భవన ఇతర నిర్మాణ కార్మికులు తమ పనులను కోల్పోయి కుటుంబ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

వెల్ఫేర్ బోర్డు నిర్ణయించిన ఆర్థిక సహాయాన్ని వెంటనే అమలు చేయాలని, బోర్డు కొత్త స్కీములు అమలు చేయాలని ఆయన డిమాండ్. 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి పెన్షన్, పనిముట్లు కొనుగోలుకు ఆర్థిక సహాయాన్ని, పిల్లల చదువులకు స్కాలర్ షిప్,  వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.

లాక్ డౌన్ లో రెన్యువల్ చేసుకోని కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు నుండి వచ్చే సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, బిల్డింగ్ వర్కర్స్ మండల అధ్యక్షుడు గోవిందు, ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తాఫా, కమిటీ సభ్యులు వెన్న బోయిన శ్రీను,పాపబత్తిని కృష్ణ, షేక్ అక్బర్ ,సైదులు, వీరన్న, వెంకట సాయి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

Satyam NEWS

ఎంప్రెస్‌: విశాఖకు విహార నౌక

Satyam NEWS

ఊహించని రీతిలో ప్రమాదం: ఇద్దరి మృతి

Satyam NEWS

Leave a Comment