30.7 C
Hyderabad
April 29, 2024 05: 40 AM
Slider నిజామాబాద్

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

#Wife protest

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వివాహిత తన భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. తన భర్త, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, కట్నం తేకపోవడంతో భర్తకు వేరే పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారని తెలిసి ఆందోళనకు దిగింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం వేముల వాడకు చెందిన అరుణను కామారెడ్డి పట్టణానికి చెందిన పైడి నవీన్ తో 2017 అక్టోబర్ లో వివాహం అయింది. సాఫ్ట్ వేర్ జబ్ చేస్తాడని చెప్పడంతో వివాహం సమయంలో 14 లక్షల నగదు, 23 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చారు.

పెళ్ళైన 10 రోజుల నుంచి అరుణపై వేధింపులు మొదలయ్యాయి. మరొక 15 లక్షలు కట్నం తేవాలని భర్త నవీన్, మామ సురేందర్, అత్త సునీత, ఆడపడుచు స్వప్న వేధించసాగారు. తనకు నచ్చినట్టు కట్టు బొట్టు ఉండాలని మామ సురేందర్ అరుణను వేధించేవాడు.

భార్య భర్తల బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు కిటికీలోంచి తొంగి చూసేవాడు. ఓసారి తన భర్త ఆదిలాబాద్ తీసుకెళ్తానని అంటే అక్కడ నిన్ను రూంలో ఉంచి నా కొడుకు బయటకు వెళ్తే ఎవరైనా నిన్ను రేప్ చేస్తే పరిస్థితి ఏంటని వెళ్లనొవ్వలేదని అరుణ తెలిపింది.

అలాగే తనకు పిల్లలు కారని, గర్బ సంచి లేదని నిందలు మోపుతున్నారని తెలిపింది. దాంతో పెళ్ళైన 7 నెలలకు అరుణ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పుడప్పుడు ఇంటికి వస్తే రాణించేవారు కాదు. వేములవాడలో పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కోసం, మెయింటెనెన్స్ కోసం కేసులు పెట్టినా రాలేదని అరుణ తెలిపింది. తాను వెళ్లిన నుంచి ఇంకో పెళ్లి చేసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని,

ఈ రోజు కూడా పెళ్లి చూపులకు వెళ్తున్నారని తెలిసి ఇంటి వద్దకు వస్తే తనపై కొట్టడానికి వచ్చారని అరుణ తెలిపింది. తనకు న్యాయం చేయాలని, తన భర్త తనకు దక్కేలా చూడాలని, నాలగా ఇంకో అమ్మాయి జీవితం నాశనం కావద్దని తాను వేడుకుంటుంది

Related posts

యువతి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు

Satyam NEWS

తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన దళిత బంధు

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: సిర్పూర్ పేపర్ మిల్లు బంద్

Satyam NEWS

Leave a Comment