28.7 C
Hyderabad
April 26, 2024 10: 49 AM
Slider ముఖ్యంశాలు

గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా?

#MalluBhattiVikramarka

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులను కూడా ఆరున్నర ఏళ్లుగా భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ గాడిదలు కాస్తున్నారా లేక గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు నిప్పులు చెరిగారు.

కోవిడ్ -19 విలయతాండవం నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలను భట్టి విక్రమార్క మల్లు సారధ్యంలోని సీఎల్పీ బృందం పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారంనాడు భట్టి విక్రమార్క బృందం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించింది.

అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గత ప్రభుత్వం కట్టిన భవనాలు ఇతర మౌలిక సదుపాయాలు తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆరేళ్ళల్లో కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు.

గత ప్రభుత్వం మంజూరు చేసిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది నియామకాలు కూడా ఈ ప్రభుత్వం చేయలేదని అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి అంటే 350 పడకల ఆస్పత్రిగా ఉండాలి కానీ ఇది ఇంకా 100 పడకల ఆస్పత్రుగానే ఉంది. వంద పడకల ఆసుపత్రికి ఉండాల్సిన కనీస సదుపాయాలు కూడా ఇక్కడ లేవని భట్టి విక్రమార్క మల్లు వివరించారు.

కరోనా రోగులను పరీక్షించే సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ అసలు లేవు. ఇక ఎక్స్ రే మిషన్ పని చేయడం లేదని ఆయన మీడియాకు చెప్పారు. ఇక రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్ల పోస్టులు అన్ని ఖాళీగానే ఉన్నాయని భట్టి చెప్పారు. మొత్తంగా ఇక్కడ 49 డాక్టర్ల పోస్టులు మంజూరు అయితే 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయని భట్టి చెప్పారు.

ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వం కరోనను కట్టడి చేసేందుకు పేద ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఐసోలేషన్ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భట్టి డిమాండ్ చేశారు. హోమ్ క్వారయింటైన్ వల్ల గ్రామాల్లో కరోనా పెరుగుతోందని అన్నారు.

Related posts

సాఫ్ట్‌వేర్ శార‌దకు టీటా రాష్ట్ర నాయకత్వంలో స్థానం

Satyam NEWS

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రాధాన్యం

Satyam NEWS

పేదలకు మెరుగైన వైద్య సేవలు

Bhavani

Leave a Comment