38.2 C
Hyderabad
May 5, 2024 21: 09 PM
Slider హైదరాబాద్

బస్తీలలో సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు

#amberpet

వివిధ బస్తీలలో సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. మంగళవారం కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ ఉమారమేష్ యాదవ్ తో కలిసి కాచిగూడ డివిజన్ లోని చప్పల్ బజార్, నందు ఆర్ట్స్ గల్లీలో జనరల్ ఎమ్మెల్యే బడ్జెట్ నుండి కేటాయించిన సుమారు 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మంచినీటి, డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న బస్తీల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, గత 3 సంవత్సరాలుగా నిత్యం ప్రజల్లో ఉంటూ, బస్తీల వారీగా అవసరాలను గుర్తించి, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఫ్లై ఓవర్ లు, రోడ్లు, దశాబ్దాల నాటి పైప్ లైన్ లను మార్చి కొత్తవి ఏర్పాటు చేయడం, పార్కుల సుందరీకరణ వంటి అన్ని పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ, నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే కుబ్దిగూడ బస్తీలో పాదయాత్ర నిర్వహించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ బస్తీలో చెట్ల కొమ్మలు రోడ్డు మీదకు వచ్చి విద్యుత్ తీగలకు తగులుతూ తరచుగా కరెంట్ పోతుంది కనుక కొమ్మలను అవసరమైన మేరకు తొలగించాలని, అక్కడక్కడ మరికొన్ని వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, అలాగే బస్తీలో డ్రైనేజీ పైప్ లైన్ కొత్తది వేయాలని, అదేవిధంగా వాహనాల అతి వేగాన్ని నియంత్రించేలా రోడ్డు పై స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సన్యాసి రావు,జీహెచ్ఎంసీ డీఈ సువర్ణ, ఏఈ ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ సంపత్, ఎలక్ట్రిక్ డీఈ వెంకట రమణారెడ్డి, ఎస్ఎఫ్ఐ ఇంఛార్జ్ తిరుపతి నాయక్, టీఆర్ఎస్ పార్టీ కాచిగూడ డివిజన్ ప్రెసిడెంట్ భీష్మ, సెక్రెటరీ సదానంద్, శిరీష ఓం ప్రకాష్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

త్యంన్యూస్, అంబర్ పేట

Related posts

కృష్ణానదీ ప్రాంతాలలో కూడా పటిష్టంగా లాక్ డౌన్

Satyam NEWS

వైజాగ్ నుంచి వారణాసికి సూపర్ ఫాస్ట్ రైల్ కు సర్వే ప్రారంభం

Satyam NEWS

పోడు పట్టాల పంపిణీలో అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి

Murali Krishna

Leave a Comment