36.2 C
Hyderabad
May 12, 2024 16: 22 PM
Slider ఖమ్మం

పోడు పట్టాల పంపిణీలో అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి

#collector

పోడు పట్టాల పంపిణీ ప్రక్రియలో  పాలిగన్ మ్యాపులు తప్పులు లేకుండా కరెక్ట్ గా అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ రెవిన్యూ,  పంచాయతి రాజ్ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి సమావేశపు హాలులో పోడు లబ్ధిదారుల ఫోటోలు కరెక్షన్, పాలిగన్ మ్యాపులు అప్లోడ్ చేయు ప్రక్రియను ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ   పోడు  ప్రక్రియ చివరిదశకు వచ్చామని, ఎలాంటి తప్పులకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎంతో పకడ్బందీగా పోర్టల్ లో అప్లోడ్ చేయాలని చెప్పారు. లబ్ధిదారుల   ఫోటోలతో పాటు విస్తీర్ణంలో సవరణలు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని  ఆదేశించారు.    ఫోటోలు, విస్తీర్ణంలో  వచ్చిన వ్యత్యాసాలను  సరిచేయు  అంశంపై తహసీల్దార్లు, ఎంపిడిఓల కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తయారు చేయబడిన జాభితాను తహసీల్దార్, ఎంపీడీఓ సంయుక్త ధ్రువీకరణ చేయాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,  కొత్తగూడెం, భద్రాచలం ఆర్డిఓలు స్వర్ణలత, రత్న కల్యాణి  అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పంట మార్పిడిపై రైతులతో చర్చ

Satyam NEWS

కడప జిల్లాలో దొంగనోట్ల చెలామణి

Bhavani

కురుపాం పాము ఘటన: ప్రాణాపాయ స్థితి నుంచీ కన్నవారి చెంతకు

Satyam NEWS

Leave a Comment