41.2 C
Hyderabad
May 4, 2024 17: 50 PM
Slider నిజామాబాద్

క్లీన్ ప్రెమిసిస్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

#Minister Vemula Prashanthareddy

రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంపై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇంటి ఆవరణలో పరిసరాలు పరిశుభ్రం చేసి, మొక్కలకు నీటిని పట్టారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ “మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్  సూచించినట్లు..వర్షాకాలం దగ్గర్లోనే ఉంది కాబట్టి, దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు విధిగా, సామాజిక బాధ్యతగా భావించి తమ ఇంటి ఆవరణలో పేరుకు పోయిన చెత్తను,నిల్వ ఉన్న నీటిని తొలగించాలి.తద్వారా దోమలను నిలువరించగలుగుతాం. సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం.

కరోనా వైరస్ లాంటివి వచ్చిన ఈ పరిస్థితుల్లో దోమల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా లాంటివి వస్తే..కరోనా భయం ఒకటి వెంటాడుతుంది. జలుబు, జ్వరం లాంటి జబ్బులు తో కరోనా నే కావొచ్చు అనే భయం నెలకొంటుంది. అందుకోసం ఇంటి ఆవరణలోని పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుందాం. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను దరిచేరకుండా చేసుకుందాం” అని మంత్రి కోరారు.

Related posts

పైడిత‌ల్లి జాత‌ర‌: సిరిమాను తిరిగే ప్రాంతాన్నిప‌రిశీలించిన‌ ఎస్పీ

Satyam NEWS

కాన్ఫిడెన్స్: అన్ని మునిసిపాలిటీలూ మనవే

Satyam NEWS

చనిపోయిన తల్లి బిడ్డ ఏడుపు తో బ్రతికింది

Satyam NEWS

Leave a Comment