38.2 C
Hyderabad
May 3, 2024 22: 39 PM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రం భారీ చోరీ కేసులో నిందితుడు అంత రాష్ట్ర వాసి..!

#vijayanagarampolice

ఛ‌త్తీస్ ఘ‌డ్ వాసి లోకేష్ గా అనుమానం..?

స‌రిగ్గా మూడు రోజుల క్రితం అంటే ఈ నెల 22న ఏపీలోని విజ‌య‌న‌గ‌రం గంట‌స్థంభం వ‌ద్ద ర‌వి జ్యూయ‌ల్ల‌రీ  షాపులో భారీ దొంగ‌త‌నం జ‌రిగి…పోలీసుల‌కు ప‌ట్టుకోండి చూద్దాం అంటూ అగంత‌కుడు స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 4 కేజీలు అంటే ర‌మామ‌రి మూడు కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ కావ‌డం….ఫిర్యాదు అందుకున్న టూటౌన్ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం…క్లూస్ టీమ్స్ ను  రంగంలోకి దించ‌డం అన్నీ శ‌ర‌వేగంగా జ‌రిగాయి.

ఈ షాపు ప‌క్క‌నే పాండు జ్యూయ‌ల్లెరీ షాపులో కూడా అదే రోజు దొంగ‌త‌నం జ‌రిగింది కూడ‌. ఇలాగే కొద్ది రోజుల‌క్రితం సీఎంఆర్ షాపులో కూడా  చోరీ జ‌రిగింది. అయితే వ‌న్ టౌన్ పో్లీసుల‌కు ఫిర్యాదు రావ‌డం…అక్క‌డ సీసీ పుటేజ్ లోఅగంతకుడు ఉండ‌టం…త‌ద‌నంతరం..గంట‌స్థంబం వ‌ద్ద భారీచోరీ జ‌ర‌గ‌డంతో పోలీసులు  ఆ కోణంలోనే ద‌ర్యాప్తు ప్రారంభించారు.

సీసీ పుటేజ్ ఆధారంగా….నిందితుడు అంత‌రాష్ట్ర వాసిగా అనుమానించారు..పోలీసులు. దీంతో  ఘ‌ట‌నాస్థ‌లిలో సేక‌రించిన‌ వేలిముద్ర‌ల‌తో…పోలీసులు…నిందితుడ్నిప‌ట్టుకునేందుకు రంగంలోకి దిగారు.ఈ మేర‌కు ఎస్పీ దీపిక ఆదేశాల‌తో సెంట్ర‌ల్ క్రైమ్ స్టేష‌న్ సీఐలు కాంతారావు,శ్రీనివాస‌రావులు…. నిందితుడిని ప‌ట్టుకునే  వేట‌లో ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ప‌క్కా ఆధారాల‌తో నిందుతుడు చ‌త్తీస్ ఘ‌డ్ లోఉన్న‌ట్టు తెలుసుకున్నారు.వేలిముంద్ర‌లు..ఘ‌ట‌నాస్త‌లిలో ల‌భించిన ఆన‌వాళ్లు….దొంగ‌త‌నం జ‌రిగిన విధానం(మోడ‌స్ ఆప‌రేష‌న్)తో నిందుతుడు లోకేష్ అని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక చ‌త్తీస్ ఘ‌డ్ లో  నిందితుడ్ని ప‌ట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.అయితే  భారీ చోరీను స‌వాల్ గానూ ప్రెస్టేజ్ అంశంగా తీసుకున్న విజ‌య‌న‌గరం ఇంచార్జ్ డీఎస్పీ…ఏఎస్పీ  అనిల్…స్వ‌యంగా రంగంలోకి దిగి…నిందుతుడ్ని ర‌ప్పించే ప‌నిలో ప‌డ్డారు. కాగా రోజువారీగా ఎస్పీ దీపికా నిర్వ‌హించే సెట్ కాన్ఫ‌రెన్స్ లో…గంట‌స్థంభం చోరీ గురించి…విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీని ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం.ఏదైనా  ఈ భారీ చోరీ  అటు విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీకి…ఇటు సెంట్ర‌ల్ క్రైమ్ స్టేష‌న్ పోలీసుల‌కు ఓ స‌వాల్ అనే అని అంటోంది.. స‌త్యం న్యూస్.నెట్.

Related posts

ఓ వైపు ఎమ్మెల్యే ప్రోగ్రాం..మ‌రో వైపు ట్రాఫిక్ జామ్…ఆ ట్రాఫిక్ లోనే… ఎస్పీ వెహికిల్….!

Satyam NEWS

మహిళలపై అత్యాచారాలకు నిరసనగా బండి ఒక రోజు దీక్ష

Satyam NEWS

రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ‌కు మ‌రో పుర‌స్కారం

Satyam NEWS

Leave a Comment