29.7 C
Hyderabad
May 7, 2024 04: 05 AM
Slider ముఖ్యంశాలు

ప్రజలను నేరుగా కలవాలని నిర్ణయించిన సిఎం జగన్

#Y S Jaganmohan Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు నెల నుంచి గ్రామాల్లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు. గురువారం నాడు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలు, విధివిధానాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని ప్రకటించారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ఆయన అన్నారు. ప్రకటించిన సమయం లోగా సకాలానికే పథకాలు అందాలని, ఎవరి దరఖాస్తులు కూడా తిరస్కరించకూడదని సిఎం అన్నారు. అర్హత ఉన్నవారికి పథకాలు రాకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలని ఆయన అన్నారు. ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటిస్తా. అప్పుడు ఎవరి నుంచి కూడా తమకు పథకాలు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదు.’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Related posts

శ్రీశైలానికి భారీగా చేరుతున్న వరద నీరు

Satyam NEWS

వైసీపీ ఎమ్మెల్యే దూషణలతో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Natural Male Enhancement Pills Smiling Bob

Bhavani

Leave a Comment