33.2 C
Hyderabad
May 15, 2024 13: 40 PM
Slider హైదరాబాద్

25న జరిగే ‘యాదవుల యుద్ధభేరి సభ’ విజయవంతం చేయాలి

#yadava

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25 న నాగోల్ శుభం కన్వెన్షన్ లో జరిగే యాదవులు యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ తెలిపారు. ఈమేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యాదవులు 18శాతం ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయని కానీ జనాభాకు అనుగుణంగా ప్రాతినిథ్యం దక్కడం లేదన్నారు.

యాదవుల అభివృద్ధికి  ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. అలాగే బిసిలలలో జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ ఎస్  పార్టీ కేవలం 5 గురికి మాత్రమే ఇచ్చి యాదవులు చిన్నచూపు చూస్తుందన్నారు. యాదవులను రాజకీయంగా చైతన్యం చేసి రాబోయే రోజుల్లో   యాదవులు, ఉపకులాలకు 22ఎమ్మెల్యే, 7ఎమ్మెల్సీ, 5 ఎంపిస్థానాలు దక్కినుంచికోవడమే లక్ష్యంగా ఈ యుద్ధభేరి సభ జరుగుతుందని దీనికి యాదవులు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కరాటే కల్యాణి,  యాదవ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చింతల రవీంద్ర నాథ్ యాదవ్, జవహర్ నగర్ కార్పొరేటర్ మేక లలిత యాదవ్ న్యాయవాదుల సంఘం రేణుక యాదవ్, అంబర్ పెట్ కాంగ్రెస్ నేత ఆర్.లక్ష్మణ యాదవ్, ఓరుగంటి వెంకటేష్ యాదవ్ ,బైరి రామచంద్రా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒక్క రోజే 100 కేసులు…బెంబేలెత్తిపోతున్న ప్ర‌జ‌లు..

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

Satyam NEWS

అంతర్జాతీయ కరాటే పోటీకి ఎంపికైన శివతేజ

Satyam NEWS

Leave a Comment