30.7 C
Hyderabad
April 29, 2024 05: 22 AM
Slider గుంటూరు

కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు

#kotappakonda

గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కోటప్పకొండకు అరుదైన గౌరవం దక్కింది. త్రికోటేశ్వర స్వామి నెలవై ఉన్న కోటప్పకొండకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) గుర్తింపునిచ్చింది. కోటప్పకొండ లో భక్తులకు అందించే సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందుతున్నాయని, నాణ్యతతో కూడిన సేవలు లభిస్తున్నాయని ISO సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ISO గుర్తింపు పత్రాన్ని త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో నరసరావుపేట ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ధర్మకర్త కొండలరావు జమిందార్, కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి లకు వేదపండితుల సమక్షంలో సంస్థ అధికారులు అందించారు. కోటప్పకొండకు ISO 9001:2015 గుర్తింపు రావడం హర్షణీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి ఈ విధంగా అంతర్జాతీయ గుర్తింపు రావటం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ దేవస్థానం లో నాణ్యమైన సేవలందించేందుకు సహకరిస్తున్న కార్యనిర్వహకులకు, పాలకమండలికి, వేదపండితులు ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోటప్పకొండను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దటమే తన ఆకాంక్ష అని ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

రాబోయే 2022 వ సంవత్సరం లో కోటప్పకొండ లో భక్తులకు అందిస్తున్న ప్రసాదాలు లడ్డు, అరిసెల నాణ్యతపై కూడా అంతర్జాతీయ గుర్తింపునిస్తామని, ఇక్కడ వాటి తయారీ, భక్తులకు అందించే పద్దతి చాలా బాగుందని హైమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రతినిధి తెలిపారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్

Related posts

మత్తులో జోగుతున్న ఆబ్కారీ ఆఫీసు

Satyam NEWS

ఇస్రో బాహుబలి రెడీ.. చంద్రయాన్‌ -3కు సర్వం సిద్ధం

Bhavani

విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలి

Satyam NEWS

Leave a Comment