27.7 C
Hyderabad
May 4, 2024 10: 17 AM
Slider ఖమ్మం

ప్రజల భద్రతకు భరోసా కోసమే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం

#khammamtownacp

ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ఏఎస్పీ అంజనేయులు  అన్నారు. ఖమ్మం డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో  మేకలబండ బజార్ లో తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని 40 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో, 49 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ కమ్యూనిటీ కనెక్ట్ ద్వారా నేరరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా  పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అందులో భాగంగా స్ధానిక ప్రజలకు ఎలాంటి అభద్రత భావం లేకుండా నేరస్ధుల కదలికలను కట్టడి చేయడానికి ఇలాంటి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలపై నిరతరం నిఘా ఉంటుందన్నారు. స్దానిక ప్రాంతాలలో ప్రజల స్వచ్ఛందంగా  భాగస్వామ్యమై ముఖ్యమైన కూడలిల్లో సి‌సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అక్రమ సంపాదనకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్ల  మాటలు నమ్మి మోస పోవద్దని అన్నారు.  ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల నుండి  అప్రమత్తంగా వుండాలని, బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించవద్దని సూచించారు. ఎలాంటి అత్యవసర సమయంలో  అయిన డయల్ 100 కు గాని, స్దానిక పోలీస్ స్టేషన్ కు  సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సిఐలు శ్రీధర్, చిట్టిబాబు ,సర్వయ్య,రామకృష్ణ  సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.

Related posts

టెస్టింగ్:పాక్‌ క్రూయిజ్‌ క్షిపణి రాద్‌–2 సక్సెస్‌

Satyam NEWS

భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

Satyam NEWS

నో వైరస్ ఓకే:చైనా యువతి భారత యువకుడి పెళ్లి

Satyam NEWS

Leave a Comment