40.2 C
Hyderabad
May 6, 2024 15: 47 PM
Slider ప్రపంచం

టెస్టింగ్:పాక్‌ క్రూయిజ్‌ క్షిపణి రాద్‌–2 సక్సెస్‌

pakistan launches missile named Rad-2 sucsessfully

భారత్‌ బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణికి దీటుగా పాకిస్తాన్‌ వైమానిక పరీక్షను మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. అణుసామర్థ్యం గల క్రూయిజ్‌ క్షిపణి రాద్‌-2ను 600 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించింది. ఇది భూమిపై, సముద్రంలో సైనిక ‘నియంత్రణ సామర్థ్యం’ను పెంచింది. లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించేందుకు రాద్‌-2 ఆయుధ వ్యవస్థకు అత్యాధునిక నావిగేషన్‌ వ్యవస్థను అనుసంధానించారని మిలటరీ అధికార ప్రతినిధి

ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాకిస్తాన్‌ శక్తి, సామర్థ్యాలకనుగుణంగా మరో కీలక అడుగు ముందుకు పడిందని లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీమ్‌ జకీ మంజ్‌ హర్షం వ్యక్తంచేశారు. పాకిస్తాన్‌ అధ్యక్షుడు అరీఫ్‌ అల్వి, ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్, సీనియర్‌ మిలిటరీ అధికారులు ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు.

Related posts

యువతి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు

Satyam NEWS

అన్ని ప్రాంతీయ భాషల్లో వస్తున్న ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం

Satyam NEWS

తెదేపా, జనసేన మానిఫెస్టో కమిటీ కి దళిత త్రిదళ పత్రం

Satyam NEWS

Leave a Comment