29.7 C
Hyderabad
May 4, 2024 06: 35 AM
Slider ప్రపంచం

ఉద్యోగం చేసే మహిళ గర్భవతి కావడం తప్పా?

#pregnantwomen

ఉద్యోగం చేసే ఒక మహిళ గర్భవతి కావడం తప్పా? కచ్చితంగా తప్పే అని చెప్పాడు ఒక సంస్థ యజమాని. అలా చెప్పిన యజమాని ఆ తర్వాత పరిహారం చెల్లించాల్సి వచ్చింది. షార్లెట్ లీచ్ అనే 34 మహిళ అమెరికాలోని CIS సర్వీసెస్‌లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా పని చేస్తుండేది. ఆమెకు చాలా సార్లు గర్భస్రావం జరిగింది. ఈ విషయం ఆమె పని చేసే సంస్థలో మేనేజర్ కు కూడా తెలుసు.

చివరకు ఒక సారి లీచ్ మళ్లీ గర్భవతి అయింది. ఈ సారి గర్భస్రావం జరగలేదు. దాంతో ఆనందంగా ఆమె వెళ్లి మేనేజర్ ను సెలవు అడిగింది. ఇన్ని సార్లు గర్భస్రావం జరిగింది…ఇప్పుడు గర్భవతి అయిందని ఆ మేనేజర్ సానుభూతి కూడా చూపకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు.

లీచ్ ఎలాంటి ప్రసూతి సెలవులకు అర్హురాలు కాదని ఆమె బాస్ పేర్కొన్నారు. ఎందుకంటే ఆమె తన కొత్త ఉద్యోగ ఒప్పందంపై ఇంకా సంతకం చేయలేదని చెప్పారు. ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ ఆందోళనతో లీచ్ కి మళ్లీ గర్భస్రావం జరిగిపోయింది. దాంతో ఆమె ఉపాధి ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. మొత్తం కేసు పరిశీలించిన తర్వాత ఉపాధి ట్రిబ్యునల్ ఆమెకు £14,885 (రూ. 14,86,856) పరిహారంగా ఇచ్చింది.

Related posts

“తిరుపతి జిల్లా” గా పేరు మార్చాలి

Satyam NEWS

న్యాయమూర్తుల్ని దూషించిన మాజీ జస్టిస్ పై కేసు

Satyam NEWS

పెరుగుతున్న పాజిటీవ్ కేసులతో నాగర్ కర్నూల్ జిల్లా అప్రమత్తం

Satyam NEWS

Leave a Comment