Slider విజయనగరం

అయిదు ల‌క్ష‌లు..కాదు…25 లక్ష‌లు న‌ష్ట‌ప‌రిహరం ఇవ్వాలి

#arakutelugudesham

పాము కాటుతో విద్యార్ధి మృతిపై భగ్గుమన్న టీడీపీ అర‌కు పార్ల‌మెంట్ నేతలు

ఏపీ డిప్యూటీ సీఎం పాముల‌ పుష్ప‌శ్రీవాణి నియోజ‌క వ‌ర్గ‌మైన  కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో  8వ తరగతి చదువుతున్న ముగ్గురు  విద్యార్దులైన‌  మంతిన రంజిత్, ఈదుబిల్లి వంశీ జీజిరాం, వంగపండు నవీన్ ల‌ను పాము కాటేసినఘ‌ట‌న జిల్లా వ్యాప్తంగా సంచ‌ల‌నమైంది. ఆ ముగ్గురు విద్యార్ధుల‌లో మంతిన రంజిత్ అనే విద్యార్ధి ఒక్క రోజు త‌ర్వాత అనంత‌లోకాల‌కు వెళ్లిపోయాడు. డీప్యూటీ సీఎం నియోజ‌క వ‌ర్గం కావ‌డంతో.సీఎం త‌క్ష‌ణం స్పందించి మృతి చెందిన విద్యార్ధి కుటుంబానికి 5 ల‌క్ష‌లు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు కూడ‌.

తాజాగా  తిరుమ‌ల హస్ప‌ట‌ల్ లో చికిత్స పొంద‌తున్న మిగిలిన ఇద్ద‌రు విద్యార్దుల‌ను  అర‌కు టీడీపీ పార్ల‌మెంట‌రీ నేత గుమ్మ‌డి సంధ్యారాణి  ప‌రామ‌ర్శించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, అరకు పార్లమెంట్ అధ్యక్షులు గుమ్మిడి సంధ్యారాణి గారితో పాటు, మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, బొబ్బిలి చిరంజీవులు,, కురుపాం టీడీపీ ఇంచార్జ్ తోయక జగదీశ్వరి , పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు , మహిళ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు సువ్వాడ వనజాక్షి, అనురాధ బేగం, పార్టీ నేత‌లు విజ్జపు ప్రసాద్, కొండపల్లి భాస్కరరావు, డొంకాడ రామకృష్ణ, అక్కేనా మధు, విజయంకుశం, చినబాబు, బాషా, మహేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా అర‌కు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు గుమ్మ‌డి సంధ్యారాణి విలేక‌రుల‌తో మాట్లాడుతూ…5 ల‌క్ష‌లు ఇచ్చి చేతులు దులుపుకోవ‌డం కాద‌ని…స‌ద‌రు మృతిచెందిన విద్యార్ధి కుటుంబానికి 25 ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారంఇవ్వాల‌ని త‌మ పార్టీ డిమాండ్ చేస్తోంద‌న్నారు.ఒక డిప్యూటీ సీఎం నియోజ‌క‌వర్గంలో వ‌స‌తి గృహాల ప‌రిస్థితి అలాగుంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెలా ఉన్న‌యో అర్ధ‌మ‌వుతోంద‌న్నారు.

వ‌స‌తిగృహ‌ల అభివృద్ది అంటే…పార్టీజెండాకున్న రంగు వేయ‌డం కాదని..అన్ని వ‌స‌తి గృహాల‌లో ప్ర‌తీస‌మస్య‌ను శాశ్వ‌తంగా రూపు మాపాల‌న్నారు. గిరిజ‌న శాఖ మంత్రి ఇలాకాలోనే  అదీ విద్యార్ధి వ‌స‌తి గృహంలో పాము ప్ర‌వేశించి  విద్యార్దుల‌ను  కాటేసిందంటే..ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌ల్స్ ఎంత భ‌ద్ర‌త‌గా ఉంటున్నాయో…సామాన్య మాన‌వుడికి ఇట్టే అర్ధ‌మ‌వుతోంద‌న్నారు. త‌క్ష‌ణం.మృతిచెందిన విద్యార్దికి కుటంబానికి ప‌రిపూర్ణ‌మైన న్యాయం  జ‌ర‌గాల‌ని గుమ్మ‌డి సంధ్యారాణి డిమాండ్ చేసారు.

Related posts

ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులు

Satyam NEWS

ప్రజల దాహార్తిని తీర్చేందుకు DSR ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం

Satyam NEWS

బిఎస్పి ములుగు జిల్లా ఇంచార్జి గా శనిగరపు నరేష్ కుమార్

Satyam NEWS

Leave a Comment