28.7 C
Hyderabad
May 5, 2024 07: 33 AM
Slider జాతీయం

ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులు

#kishanreddy

రేపటి నుంచి ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులను మార్చుతున్నామని కేంద్రమంత్రి కిసాన్ రెడ్డి తెలిపారు. దేశంలో 2.8 కోట్ల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. తొలిదశలో 1.25 లక్షల షాప్ లని ప్రధాని రేపు ప్రారంభిస్తారని ఈ షాప్ ల్లో సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరిగాయని, ప్రధానమంత్రి మోడీ రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.

తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిమొట్లు, కిసాన్​ సమ్మాన్​ యోజన లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎరువుల రిటైల్​ షాపులను ప్రధానమంత్రి కిసాన్​ సేవా కేంద్రాలుగా రేపటి నుంచి మార్చబోతున్నది. ఎరువుల కోసం ఒక దగ్గరికి, భూసార పరీక్షలకు ఒక దగ్గరకు.. ఇలా అనేక చోట్లకు వెళ్లాల్సి వస్తున్నది. అలా కాకుండా రేపటి నుంచి  రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు.. కిసాన్​ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి.

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో రైతులకు అందుబాటులో ఉంటాయి. భూసార పరీక్షలు, సీడ్​ టెస్టింగ్​ సౌకర్యాలు ఉంటాయి. కిసాన్​ సేవా కేంద్రాలు రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అప్​గ్రేడేషన్​, అవగాహన కిసాన్​ కేంద్రాల ద్వారా కృషి చేస్తాం అని ఆయన తెలిపారు. రేపటి నంచి నీమ్​కోటెడ్​ యూరియాతోపాటు సల్ఫర్​ కోటెడ్​ యూరియా కూడా దేశమంతా రాబోతున్నది. 14వ విడత పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధులు కూడా రేపు ఉదయం ప్రధాని 8.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారు.

తెలంగాణలో సుమారు 39 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడనున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల ఇబ్బందులు, సమస్యలపై ఒకరికొకరు తెలుసుకునేందుకు ‘కిసాన్​ కి బాత్​’ రైతుల గ్రూప్​ మీటింగ్​ రేపటి నుంచి అమలు చేయబోతున్నాం. ప్రతి నెల రెండో అధివారం కిసాన్​ కి బాత్​ ఉంటుంది. కిసాన్​ సేవా కేంద్రం​ పరిధిలో ఉండే రైతులతో వాట్సాప్​ గ్రూప్​ క్రియేట్​ చేసి.. ఎప్పటికప్పుడు వాతావరణ, వ్యవసాయ, మార్కెట్​ అప్​డేట్లు అందులో పంపే కార్యక్రమానికి రేపటి నుంచి కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. నానో యూరియాను కూడా ప్రధాని ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ సునామీలో బిఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుంది

Satyam NEWS

రవాణాశాఖ వైబ్ సైట్ లో సాంకేతిక సమస్య

Satyam NEWS

నాట్అగైన్:అనువాదంలో పొరపాటుఫేస్‌బుక్ క్షమాపణలు

Satyam NEWS

Leave a Comment