Slider మహబూబ్ నగర్

రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫిర్యాదు

#panagalpolice

భారత రాజ్యాంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగం కు దళితులకు సంబంధం ఏమిటి అంటూ మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీద దేశద్రోహం తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై వనపర్తి జిల్లా పానగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందచేశారు.

భారతదేశం మీద నిత్యం దురాక్రమణ కు పాల్పడుతున్న చైనా దేశం రాజ్యాంగం మాదిరి మన దేశ రాజ్యాంగం ఉండాలని కేసీఆర్ చెప్పడం దేశ ద్రోహమని వారన్నారు. అంబేద్కర్ రాసిన భారతదేశ రాజ్యాంగాన్ని కించపరుస్తున్న కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సన్నయ్య మాదిగ, కెవిపిఎస్ జిల్లా నాయకులు ఆది స్వామి ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర నాయకులు కార్తీక్ మాదిగ ఎర్రం సిద్దయ్య ఆది గోపీచంద్ ఎర్రం రాములు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

తిరుపతి లడ్డు ధర పెంపుపై పుకార్లు నమ్మవద్దు

Satyam NEWS

బంగాళాఖాతంలో పెరుగుతున్న ‘అసని’ తుపాను తీవ్రత

Satyam NEWS

షబ్బీర్ అలీ భూములు బెదిరించి కబ్జా చేసినవి కాదు

Satyam NEWS

Leave a Comment