39.2 C
Hyderabad
May 3, 2024 11: 18 AM
Slider ప్రత్యేకం

షబ్బీర్ అలీ భూములు బెదిరించి కబ్జా చేసినవి కాదు

#congress

మాజీ మంత్రి షబ్బీర్ అలీ భూములు బెదిరించి కబ్జా చేసినవి కాదని, బాజాప్త డబ్బులు పెట్టి కొన్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం షబ్బీర్ ఆలీకి చెందిన భూములపై బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేసిన ఆరోపణలపై నేడు కాంగ్రెస్ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. నిన్న బిజెపి నాయకుడు  వెంకటరమణారెడ్డి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ పై చేసిన ఆరోపణలు పసలేనివన్నారు.

షబ్బీర్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు బాజప్త డబ్బులు ఇచ్చి భూములు కొన్నారని, ఎవరిని బెదిరించి కబ్జా చేసి తీసుకున్న భూములు కావన్నారు. నీ విద్యాసంస్థ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల భూమి కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టుకుంటే వారు కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా కోర్టు ఆర్డర్ ను లెక్క చేయకుండా వారిని బెదిరించి 30 వేలకు గజము ఉన్న భూమిని 3 వేలకు గజం తీసుకోలేదా.. దీనిపై ఆధారాలు బయట పెట్టమంటావా.. ఆత్మ విమర్శ చేసుకుంటావా.. అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నాయకులు విడుదల చేసిన డాక్యుమెంట్లు

ఈ రోజు రైతుల భూముల గురించి పోరాటం చేస్తున్న అంటున్నావని, కర్షకులు రూపాయి రూపాయి పోగుచేసుకొని వాళ్ళ రక్తము, చెమట ధారపోసి, విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యాలయాల కోసం 260 ఎకరాలు భూమి తీసుకున్నారన్నారు. ఆ భూములను మీ తండ్రి, నీవు ఎడ్యుకేషన్ సొసైటీ తయారు చేసుకుని ఆ స్థలాన్ని అరోరా ఇంజనీరింగ్ కాలేజీ వారికి దారాదత్తం చేసి వారి పేరు మీద యూకో బ్యాంకులో విద్యాలయ భూములు 26 ఎకరాలు కుదవ పెట్టి ఏడు కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

మిగతా సొసైటీ సభ్యులు మా సంతకాలు ఫోర్జరీ చేసి విద్యాలయ భూములు బ్యాంకులో పెట్టి అప్పు చేశారని కోర్టుకు పోలేదా అని నిలదీశారు. కామారెడ్డి కాలేజీ సొసైటీలో ఎలా నువ్వు సభ్యునిగా చేరి, నీ మిత్రుడైన అరోరా కాలేజీ వాళ్ళని ఎలా దాంట్లో సభ్యత్వం ఇప్పించావని ప్రశ్నించారు. నీ విద్యాసంస్థను ముగ్గురికి అమ్మి వారిని బెదిరించి తిరిగి తీసుకోలేవా అని నిలదీశారు. నీకు తెరాసా ఎంపీ రంజిత్ రెడ్డి సంబంధం ఏంటి అని నిలదీశారు.

ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే ఏడు కోట్లు ఇచ్చాడని, ఆ ఏడు కోట్ల ద్వారా బెంగళూరులో 17 కోట్ల సంపాదించానని, 17 కోట్లతో ప్రోబేల్స్ స్కూల్ కొన్నానని నీ నోటి ద్వారానే నువ్వే అన్నావు కదా..  దానికి నీ సమాధానమేంటి..? అని ప్రశ్నించారు. కామారెడ్డి పట్టణం సమీపంలో అబ్దుల్లా నగర్ వెంచర్ గురించి ప్రెస్ మీట్ పెట్టి నానా హంగామా చేసి వారి వద్ద నుంచి 40 లక్షలు తీసుకున్న మాట వాస్తవం అవునా కాదో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నాయకులు విడుదల చేసిన డాక్యుమెంట్లు

అదే ప్యాకేజీలో బిటి రోడ్డు మీ ఇంటి పక్కనుండి వేయించుకోవడం నిజం కాదా అన్నారు. మీ ఇంటి సీసీ కెమెరాలలో మూడు నెలల రికార్డు తీసి చూసుకో.. లేకపోతే నీకు ముడుపులు అందించిన ఇద్దరు వ్యక్తులతో సహా సాక్షాలతో సహా బయట పెట్టమంటావా చెప్పాలన్నారు. కామారెడ్డి పట్టణంలో టీవీ కేబుల్ నెట్వర్క్ పెడతానని చెప్పి మీ సంబంధీకులను, మీ పార్టీ నాయకులను నట్టేట ముంచింది వాస్తవం కాదా.. దాన్ని కూడా సాక్షాలు బయటపెట్టాలా.. అశోక్ నగర్ కాలనీకి చెందిన ఒక అమాయకుని ఇంటి కాగితాలు బ్యాంకులో షూరిటీగా పెట్టి 20 లక్షలు అప్పు చేస్తే బ్యాంకు వాళ్లు వచ్చి ఆ ఇంటినే యాక్షన్ చేస్తామంటే నువ్వు పారిపోయింది వాస్తవం కాదా.. మెడికల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ పెట్టి మిత్రులతో కలిసి కలిసి వ్యాపారం చేసి వారినీ నట్టేట ముంచింది వాస్తవం కాదా అని నిలదీశారు.

అంతంపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 146 లో గల 1.12 ఎకరం భూమిని వెంకటరమణారెడ్డి అతని బంధువులు కలిసి రైస్ పూలింగ్ పేరుతో అధిక లాభార్జన ఆశ చూపి తన స్వలాభం కోసం అమాయకుడైన నరసింహారెడ్డిని మోసం చేసి భూమిని కబ్జా చేశారని బాధితులు పేర్కొన్నారని, ఈ విషయంపై కామారెడ్డి సీఎస్ఐ గ్రౌండ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని నీకు దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు పండ్ల రాజు, పట్టణ యువజన అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సందీప్, మున్సిపల్ కౌన్సిలర్ శివ కృష్ణమూర్తి, పాక రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకుల సవాలుకు నేను సిద్ధం

కాంగ్రెస్ నాయకులు చేసిన సవాలుకు తాను సిద్ధమని బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు తాను సమాధానం ఇస్తానన్నారు. వాళ్ళు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి నిరూపించిన వారు వేసే శిక్షకు తాను సిద్దమని ప్రకటించారు. తేదీ, సమయం చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారం సీఎస్ఐ గ్రౌండులో సిద్ధంగా ఉంటానన్నారు

Related posts

భక్తులతో క్రిక్కిరిసిపోయిన తిరుమల గిరులు

Satyam NEWS

బాండ్ల ద్వారా రూ. 100 కోట్లు సేకరించిన బల్దియా

Satyam NEWS

మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల అవినీతిపై విచారణ జరిపించాలి

Satyam NEWS

Leave a Comment