26.7 C
Hyderabad
May 15, 2024 08: 33 AM
Slider నిజామాబాద్

అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలి

#motevillage

గ్రామంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్ యేలేటి వెంకట్రాంరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లింగంపేట మండలం మోతె గ్రామస్తులు ప్రజావాణిలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ యేలేటి వెంకట్రాంరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నన్ను గెలిపించారు.. ఐదేళ్లు జిపి నాదే.. మీరు నన్నెలా ప్రశ్నిస్తారు అంటూ గ్రామస్తులపై దురుసుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ ను సొంత వ్యవసాయ పనులకు వాడుకుంటున్నాడని, ఇటీవల చెరకును కూడా అదే ట్రాక్టర్ లో తరలిస్తే పట్టుకున్నామన్నారు. స్మశాన వాటిక, డంపింగ్ యార్డులోంచి అక్రమంగా మొరం తరలిస్తూ సొంత పనులకు వినియోగిస్తున్నాడని, గ్రామంలోని పనులకు కూడా అదే మొరాన్ని వాడటంతో అందులో వస్తున్న ఎముకల ద్వారా అనారోగ్యానికి గురవుతున్నామన్నారు.

గ్రామంలో మురికి కాలువల శానిటేషన్ కోసం వచ్చిన పరికరాలు, ఇతర సామగ్రి తన ఇంట్లోనే పెట్టుకుని సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. వారం రోజులకు ఒకసారి శానిటేషన్ చేయాల్సి ఉన్నా మూడు నాలుగు నెలలకు ఒకసారి శానిటేషన్ చేస్తున్నారన్నారు. పనులు చేయనున్న అక్రమంగా బిల్లులు తీసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల తాము అక్రమాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే దానినుంచి తప్పించుకునేందుకు 27 వ తేదీన సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామన్నారు.

రాజకీయ ఒత్తిడి వల్ల తాను బిల్లు చేయడానికి సంతకం పెట్టినట్టు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులకు క్షమాపణలు స్హెప్పారని పేర్కొన్నారు. అక్రమాలను నిలదీసిన గ్రామస్తులను రాజకీయ అండదండలతో నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా తిడుతూ దురుసుగా ప్రవర్తిస్తున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని, పాలకవర్గాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

చలో హైదరాబాద్ కు కదిలిన కార్మిక సైన్యం

Satyam NEWS

సామిల్ & టింబర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment