26.7 C
Hyderabad
May 12, 2024 07: 43 AM
Slider నిజామాబాద్

సామిల్ & టింబర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

#sawmills

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పరిణిక ప్యాలెస్ లో సామిల్ అండ్ టింబర్ డిపో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అటవీశాఖ డివిజనల్ అధికారి గోపాల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చెక్కెలం రమణయ్యతో టింబర్ అండ్ సామిల్ సమస్యలపై సుమారు రెండు గంటల పాటు చర్చించారు. ఎఫ్.డిఓ గోపాల్ రావు మాట్లాడుతూ.. గతంలో ఉన్న జీఓ 55 స్థానంలో కొత్త జీఓ 69 వచ్చిందని, ఈ జీఓ జనవరి 1 నుంచి అమలులో ఉందన్నారు. ఈ జీఓ ప్రకారమే టింబర్ అండ్ సామిల్ అసోసియేషన్ ప్రతినిధులు మసులుకోవాలని సూచించారు.

జిల్లా అధికారులకు సామిల్, టింబర్ ప్రతినిధులు సహకరించాలని, సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావలన్నారు. సమన్వయంతో పని చేసుకుంటూ జిల్లాలో ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళదామన్నారు. అనంతరం ఇటీవల కొత్తగా ఎన్నిక కాబడిన నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేశారు. క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.ఆర్.ఓలు రమేష్, రవిమోహన్ భట్టు, సంజయ్ గౌడ్, విద్యాసాగర్, గంగాధర్, ఫారెస్ట్ జూనియర్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షుడు మోజం అలీఖాన్, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గోపికృష్ణ, జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, కోశాధికారి వాజిద్, గౌరవ అధ్యక్షుడు బెజ్జంకి సుదర్శన్, ఉపాధ్యక్షుడు సుదర్శన్, కళాకార్, అధికారులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

నెలాఖరులోగా బ్యాక్ లాగ్ ఉద్యోగాల నియామక ఉత్తర్వుల జారీకి చర్యలు

Satyam NEWS

మూడు రోజుల్నించి అడుగుతున్నా సీఎం కలవడం లేదు

Satyam NEWS

విడుదల సన్నాహాల్లో కర్రి బాలాజీ ‘బ్యాక్ డోర్’

Satyam NEWS

Leave a Comment