41.2 C
Hyderabad
May 4, 2024 17: 39 PM
Slider నల్గొండ

ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు

#MLA Saidireddy

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి రాజకీయ కోణంలో కాకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సహించరని అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ రావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్,మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం‌డి నిజాముద్దీన్,కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్ మాట్లాడారు.

సైదిరెడ్డి హయాంలో జరుగుతున్న అవినీతి,అక్రమాలు, అరాచకాలు వెలికితీసి నల్గొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజల్లోకి తీసుకపోతుంటే సైదిరెడ్డి దానిని జీర్ణించుకోలేక సహనం కోల్పోయి,స్థాయికి మించి మాట్లాడడం తగదని హితవు పలికారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే సైదిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని, గడ్డాలు, మీసాలు లేని వారు గడ్డాలు,మీసాలు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మరోమారు ఇటువంటి చవకబారు వ్యక్తిగత దూషణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిఘటించక తప్పదని అన్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గం ఎవరి హయాంలో అభివృద్ది జరిగిందో మీరు తిరిగే ప్రతి గ్రామంలో చంటి పిల్లాడిని అడిగినా వివరంగా చెప్తారని,3,500 కోట్ల రూపాయలతో నియోజవర్గాన్ని అభివృద్ది చేసిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి కే దక్కిందని,నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యే లు పని చేశారని,కానీ కొద్ది కాలంలోనే 500 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించుకున్న ఘనత తమకే దక్కుతుందని,నియోజకవర్గ ప్రజలందరికి తెలుసని అన్నారు.

ఎవరికి గ్రౌండ్ స్థాయిలో బలముందో లేదో త్వరలో ప్రజలే నిర్ణయిస్తారని, కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడే ముందు తమ పార్టీలో వచ్చే ఎన్నికల్లో తమరి ఎమ్మెల్యే సీటుకి ఎసరు రాకుండా చూసుకోవాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో పి‌సి‌సి జాయింట్ సెక్రటరీ ఎం‌డి.అజీజ్ పాషా,కౌన్సిలర్ తేజవత్ రాజా నాయక్,పట్టణ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య,ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వీరబాబు,కాంగ్రెస్ పార్టీ నాయకులు బాచిమంచి గిరిబాబు, వెలిదండ వీరరెడ్డి,కారింగుల వెంకటేశ్వర్లు, బొల్లేద్దు జైల్,కంకణాల పుల్లయ్య, కొల్లపూడి యోహన్,అంజనపల్లి సుదర్శన్, లచ్చిమల్ల నాగేశ్వరరావు,పోతనబోయిన రామమూర్తి,రెడపంగు రాము,సలిగంటి జానయ్య,తెప్పని యలమంద,చలమల రాఘయ్య,తెలుకుంట్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

పారిశ్రామికవేత్తలకే మేలు చేస్తున్న బీజేపీ

Bhavani

కాకినాడలో భారీగా కరోనా కిట్ల మాయాజాలం

Satyam NEWS

గిడ్డంగులలో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం

Bhavani

Leave a Comment