40.2 C
Hyderabad
April 28, 2024 15: 04 PM
Slider మహబూబ్ నగర్

గిడ్డంగులలో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం

#Warehouses

తెలంగాణ గిడ్డంగులలో ప్రైవేటు వ్యక్తులంతా పెత్తనం చేస్తున్నారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నాగర్ కర్నూల్ జిల్లాలోని కోలుకులపల్లి తెలంగాణ గిడ్డంగులలో సిఎంఆర్ కింద ఇచ్చే వడ్లకు రైస్ మిల్లర్లు బియ్యంగా మార్చి సివిల్ సప్లై కార్పొరేషన్ కి నిబంధనలు అనుసరించి పంపే ప్రక్రియ గూర్చి జడ్చర్ల తెలంగాణ గిడ్డంగుల గోదాములో టెక్నీషియన్ కంట్రోలర్ గా విధులు నిర్వహిస్తున్న సాయిబాబును వివరణ కోరగా ఆయన ఇచ్చిన వివరణ అబ్బురపరిచే విధంగా ఉన్నది.

మిల్లర్ల గుమస్తాలమని చెప్పుకుంటూ అధికారులకు మిల్లర్లకు మధ్య పైరవీలు చేసే ఆప్రైవేటు వ్యక్తులను నుండి సేకరించిన సమాచారాన్ని వివరణ ఇవ్వడంపై ఆశ్చర్యంగా అనుమతినిచ్చే ప్రక్రియను వీడియోలు ఫోటోలు ఇక్కడ తీయరాదని,ఈ గోదాములోకి ఏలాంటి వ్యక్తులకు ప్రవేశం ఉండదని మీ మీద అభిమానంతో గోదాము లోనికి అనుమతించామని గోదాంకు సంబంధం లేని కంట్రోలర్ చెప్పడం విచిత్రంగా ఉంది.

ఎక్కడ తన తప్పిదాల వ్యవహారం బయటకి పొక్కుతుందోనని అన్ని విధాలా అప్రమత్తంగా మాకు ఏమీ తెలియదు ఏదీ ఉన్న అడిషనల్ కలెక్టర్ ని సంప్రదించాలని వివరణ ఇస్తున్నారు.ఈ నెలలో ఎన్ని ఎసికెలకు అనుమతిచ్చారు ఎన్ని రిజెక్ట్ చేశారు అని వివరణ కోరగా ఇక్కడికి వచ్చినవన్నీ మంచి బియ్యమే వస్తాయని ముందుగా తెలిపినను గోదాంలోనికి వెళ్దామని తీసుకువెళ్లగా కొన్ని బియ్యాన్ని పరీక్షించగా కొన్ని బస్తాలలో నూకలు కొన్ని బస్తాలలో పశువులు కూడా తినని బియ్యం అనుమతి ఇచ్చినట్లు కనిపించింది. దానిపై ప్రశ్నించగా అవి రిజెక్ట్ చేశామని సమాధానం ఇచ్చారు.

కాగా తెలంగాణ గిడ్డంగులలో ప్రభుత్వ నియామకాల్లో విధులు నిర్వహిస్తున్న గోదాం ఇన్చార్జ్ ఎలాంటి రికార్డునైనా చూపించాలని క్రింది స్థాయి ఉద్యోగస్తుల ఆదేశించినా రైస్ మిల్లర్ల గుమస్తాలమని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు బియ్యం అనుమతి కొరకు పైరవీలు సాగించేవారిదే పెత్తనం తో అన్ని విషయాలను దాచడంపై పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా కంట్రోలర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి సైతం వారి చెప్పు చేతుల్లో ఉండడం గమనార్హం. పనికిరాని బియ్యాన్ని, నూకలను, పశువులు కూడా తినలేని బియ్యాన్ని అనుమతిస్తూ వారి

ఇష్టారాజంగా వ్యవహరిస్తున్నారు. అంతేగాక గోదాముల ఇన్చార్జులు చెప్పిన రికార్డులను సైతం ఇక్కడ లేవని వేరే గోదాంలో ఉన్నాయని, ఆ ప్రైవేట్ వ్యక్తులే కంట్రోలర్తో బహిరంగంగానే సమాధానం ఇప్పిస్తున్నారు. ఏలాంటి వివరణ కోరినా ప్రైవేట్ మిల్లుల గుమస్తాలమని చెప్పుకుంటున్న వారిని సంప్రదించి వారు చెప్పిందే శాసనంగా కంట్రోలర్ విలేకరుల అడిగిన ప్రశ్నలకు వివరణ ఇస్తున్నారు.

రేషన్ షాపులకు వచ్చే బియ్యం పై వివరణ కోరగా మా గోదాం నుండి గేటు దాటిన తర్వాత మాకు ఎలాంటి సంబంధం లేదని, అందులో మట్టి వచ్చిన, అందులో బియ్యం లేకున్నా మాకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.కానీ ప్రభుత్వ నిబంధన ప్రకారం రేషన్ షాపులోకి వచ్చిన లబ్ధిదారులకు అందించే బియ్యాన్ని ఆ మండల తహశీల్దార్ పంచనామా చేసే అధికారం ఎమ్మార్వో కు ఉంటుందని విశ్రాంత సివిల్ సప్లై ఉద్యోగులు చెబుతున్నారు.కాగా దేశ

భద్రతకు సంబంధించినవి కూడా దేశ ప్రజలతో పంచుకుంటున్న రక్షణ రంగం కంటే సివిల్ సప్లై గోదాములలో ఎవరికి తెలవకూడని చెప్పకూడని వివరాలు ఉన్నాయో అంతుచికటం లేదు. దేశానికి నాలుగవ స్తంభమైన పత్రికల ద్వారా ప్రజలకు చేరవేసే సమాచారాన్ని ఎందుకు దా పెడుతున్నారో అంతు చిక్కని ప్రశ్న

పోల శ్రీధర్ సత్యం న్యూస్ కల్వకుర్తి

Related posts

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలి

Satyam NEWS

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

రవితేజ చేతుల మీదుగా ” జెమ్” ఫస్ట్ లుక్ రిలీజ్

Satyam NEWS

Leave a Comment