40.2 C
Hyderabad
April 26, 2024 12: 16 PM
Slider జాతీయం

పారిశ్రామికవేత్తలకే మేలు చేస్తున్న బీజేపీ

అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ముందుగా జ్వాలాముఖి శక్తిపీఠ్ వద్ద ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారి అమ్మవారి శేషవస్త్రాన్ని ఆమెకు సమర్పించారు. దీని తర్వాత ఆమె నగ్రోటా బగ్వాన్‌కు బయలుదేరారు. కాంగ్రా జిల్లాలోని నగ్రోటా బగ్వాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఉపాధి, పెన్షన్, ద్రవ్యోల్బణం విషయంలో బీజేపీ ఏమీ చేయదని అన్నారు. బీజేపీ నేతలు తమ స్వార్థం కోసం ఎన్నికల బరిలో నిలిచారన్నారు. తెలివిగా ఓటు వేయండి. అర్థం చేసుకోండి, ఎవరి ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది మరియు ఎవరి తప్పు ఉంది అనేది ఆలోచించండి అని ఓటర్లను కోరారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మోసాలు, పిపిఇ కిట్ స్కామ్, టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ మరియు ఇప్పుడు డ్రగ్స్ కూడా రాష్ట్రంలో విస్తరించాయని ఆమె అన్నారు.

ఇవి బీజేపీ పాలనలో జరిగిన కుంభకోణాలు అంటూ ఆమె తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామికవేత్తలకు అంతా మేలు జరుగుతున్నదని సామాన్య ప్రజలకు మాత్రం ఏమీ జరగదని ఆమె అన్నారు. ఇలాంటి ప్రభుత్వం కావాలా? అని ఆమె ప్రశ్నించారు. హిమాచల్‌ ప్రదేశ్ లో 4 వేల మంది సైనికులు సైన్యానికి వెళ్లేవారు. ఇప్పుడు అగ్నిపథ్ పథకం కింద కేవలం 400 నుంచి 500 మంది యువకులు మాత్రమే సైన్యంలో చేరే పరిస్థితి వచ్చిందని ప్రియాంక తెలిపారు. వీరిలో కూడా 75 శాతం మందిని 4 ఏళ్ల తర్వాత ఇంటికి పంపిస్తారని ఆమె చెప్పారు. హిమాచల్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు ఇస్తాం. 63 వేల పోస్టులను భర్తీ చేస్తాం అని ఆమె హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. హర్ ఘర్ లక్ష్మీ యోజనలో మహిళలకు నెలకు 1500 ఇస్తామని హామీ ఇచ్చారు. హిమాచల్‌ను బీజేపీ అప్పుల ఊబిలో ముంచిందని ప్రియాంక తెలిపారు.

Related posts

ఇమేజ్ ప్రాసెసింగ్ పై సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్

Satyam NEWS

రాష్ట్రంలో నలుగురు మంత్రులతో మాఫియా

Satyam NEWS

పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి: సి పి ఎం

Satyam NEWS

Leave a Comment